వేదికపై అశోక్‌బాబు.. వెనుదిరిగిన చలసాని

4 Apr, 2018 13:43 IST|Sakshi
చలసాని శ్రీనివాస్‌, అశోక్‌బాబు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఏపీజేఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.  విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌తో పాటు ఎపీఎన్జీవో నేత అశోక్‌బాబు తదితరులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ క్రమంలో సమావేశానికి వచ్చిన చలసాని, వేదికపై ఉన్న అశోక్‌బాబును చూసి సమావేశంలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో నిర్వాహకులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. హోదా ఉద్యమాన్ని కొందరు నీరుగారుస్తున్నారని ఈ సందర్భంగా చలసాని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చిన వ్యక్తులే.. మళ్లీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉపయోగించుకునే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మరిన్ని వార్తలు