పరిశ్రమల అభివృద్ధికి వసతుల కల్పన

21 Jun, 2015 03:32 IST|Sakshi
పరిశ్రమల అభివృద్ధికి వసతుల కల్పన

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి  నారాయణ
 
 నెల్లూరు(రెవెన్యూ) : జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి పూర్తి స్థాయిలో వసతులు కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర పురపాల శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్‌పై పారిశ్రామికవేత్తలతో శనివారం నిర్వహించిన వర్క్‌షాపులో మంత్రి మాట్లాడారు. పరిశ్రమలు అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

దగదర్తిలో ఎయిర్‌పోర్టు నిర్మాణం త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ శ్రీహరికోటను అనుసంధానం చేసుకుని పరిశ్రమలు వృద్ధి చేస్తామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్, కృష్ణపట్నంపోర్టు సీఈవో అనిల్‌కుమార్, నగర మేయర్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రారంభం
 నెల్లూరు(రెవెన్యూ) :కృష్ణపట్నం పోర్టు సీఎస్‌ఆర్ నిధులతో ఆధునికీకరించిన ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ శనివారం ప్రారంభించారు. రూ.32 లక్షలతో మహాకవి తిక్కన పార్క్ అభివృద్ధికి మంత్రి, శంకుస్థాపన చేశారు. నారాయణ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రూ.58 లక్షల ఖర్చుతో ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ ఆధునికీకరించారని చెప్పారు.

రూ 1.10 కోట్లతో బోర్లు వేసేందుకు రెండు వాహనాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు కృష్ణపట్నం పోర్టు రూ.2 కోట్ల నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. నెల్లూరు ఎంపీ మేకపాటీ రాజమోహన్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, కలెక్టర్ ఎం జానకి, జాయింట్ కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్, పోర్టు సీఈవో అనిల్‌కుమార్,బలరామిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు