'నాకేదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత'

4 Nov, 2014 11:34 IST|Sakshi
'నాకేదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత'

విజయనగరం : భద్రతా సిబ్బంది తగ్గింపుపై విజయనగరం జిల్లా సాలూరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పి.రాజన్నదొర ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందిని తగ్గించటం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. గిరిజన ఎమ్మెల్యే అయినందువల్లే తనపై చిన్నచూపు చూస్తోందని రాజన్న దొర వ్యాఖ్యానించారు.

జన్మభూమి కార్యక్రమంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పాల్గొంటున్న తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నలుగురు గన్మెన్లను నియమిస్తున్న ప్రభుత్వం తనపై మాత్రం పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రాజన్న దొర ఆరోపించారు. కాగా రాజన్న దొరకు ప్రభుత్వం భద్రత కుదించింది. గతంలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్న ఆయనకు ప్రస్తుతం ఏ ఒక్కరినీ ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు