రాష్ట్ర ముఖ్యమంత్రా? టీడీపీ ముఖ్యమంత్రా

10 Jul, 2015 00:29 IST|Sakshi

 టీడీపీలో రౌడీ షీటర్లకే టికెట్లు ఇచ్చారు
ఏడాది పాలనలో ఇన్ని తప్పులు చేసే ప్రభుత్వం ఇదే
 వైఎస్సార్‌సీపీ హైపవర్ కమిటి సభ్యుడు తమ్మినేని

 
 పీఎన్‌కాలనీ: తెలుగుదేశం పార్టీ నాయకులు రౌడీ రాజకీయాలను ఆపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. కృష్ణా జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు, తన అనుచరులు ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు మహిళా తహశీల్దార్ వనజాక్షి పై దాడి చేయడం దారుణమన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా అని చూ డకుండా కేవలం రాజకీయ స్వలా భం కోసం ప్రభుత్వ అధికారులపై చేయిచేసుకుని నీచంగా ప్రవర్తించడం సరికాదన్నా రు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు గడిచినా నాలుగు హామీలు కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమం మరిచి తగాదాలకు, రౌడీ రాజకీయాలకు ప్రోత్సాహానిస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల్లో రౌడీలు ఎం తమంది ఉన్నారో పోలీస్ స్టేషన్లలో వారి జాబితాను తీసుకుని చంద్రబాబు సీట్లు ఇచ్చారన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, అనుచరులు అడ్డంగా దొరి కిపోయి రాజీనామా చేయకుండా వాటిని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బురద జల్లుతున్నారన్నారు. నైతిక విలువలుంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
 రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పనితీరు చూస్తుంటే అసలు ప్రజలందరి సంక్షేమాన్ని చూడాల్సి ముఖ్యమంత్రి కేవలం టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రుల కోసమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణందాస్ అన్నారు. జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు నైతిక విలువలను మరిచి తన నియోజకవర్గంలో ఇతర పార్టీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతుకు గురిచేయడం సరికాదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కోరాడ రమేష్, పాలిశెట్టి మధుబాబు, ఎన్ని సూర్యారావు, అప్పాజీ, కామేశ్వరి, వెంకటరమణ పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు