ఏలూరులో రౌడీషీటర్ రామనాథం హత్య

22 Oct, 2014 07:54 IST|Sakshi
ఏలూరులో రౌడీషీటర్ రామనాథం హత్య

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లతో దారుణంగా తలపై మోది చంపారు. మృతుడు రౌడీషీటర్‌ రామనాథంగా గుర్తించారు.

ఇతడి మీద కూడా గతంలో ఎన్నో కేసులున్నాయి. బహుశా ప్రత్యర్థులు ఇతడి కదలికలను గమనించి, ఒంటరిగా ఉన్న సమయంలో ప్రతీకారం తీర్చుకోడానికే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు