‘ఆ పిల్లల వివరాలు వెబ్‌సైట్‌లో పెడుతున్నాం’

28 Dec, 2018 15:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఇంట్లోంచి పారియపోయి వచ్చిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే తమ ప్రధాన ఉద్దేశం అంటున్నారు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డీఆర్‌ఎం ఆర్‌ ధనుంజయ్‌. శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడిన ధనుంజయ్‌ 2017 సంవత్సరంలో దాదాపు 230 మంది ఇంట్లోంచి పారిపోయి వచ్చిన పిల్లలను రైల్వే ప్రోటక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) రెస్క్యూ టీం కాపాడారని తెలిపారు. అయితే ఈ ఏడాది వీరి సంఖ్య పెరిగిందని చెప్పారు. 2018 సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు 246 మంది ఇలా ఇంటి నుంచి పారిపోయి వచ్చారని తెలిపారు.

ఇలా పట్టుకున్న పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. తాము కాపాడిన పిల్లల ఫోటోలను ఆర్‌పీఎఫ్‌ వెబ్‌ పోర్టల్‌లో పెడుతున్నాని వెల్లడించారు. దాంతో పాటు ప్రస్తుతం ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో వారి అడ్రస్‌తో పాటు ఫోన్‌ నెంబర్లను వెబ్‌సైట్‌తో పాటు సోషల్‌ మీడియాలో కూడా పెడుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు