అమరావతి అప్పులు కన్సల్టెన్సీలకు ఫలహారం

13 Aug, 2019 04:36 IST|Sakshi

బాండ్ల జారీ ద్వారా అధిక వడ్డీకి రూ.2,000 కోట్ల అప్పు 

ఆ అప్పు నుంచి రూ.322 కోట్లు కన్సల్టెన్సీలకు చెల్లింపు 

రూ.215 కోట్ల వీజీటీఎంయూడీఏ నిధి నుంచి రూ.22 కోట్లు కన్సల్టెన్సీలకు 

కేంద్రం రాజధానికి ఇచ్చిన రూ.1,500 కోట్లు వడ్డీలకు సరి 

గత సర్కారు నిర్వాకాలతో ఖజానాపై తడిసిమోపెడు భారం  

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో గత సర్కారు అందినకాడికి తీసుకున్న అప్పులు నూతన ప్రభుత్వానికి  పెనుభారంగా మారాయి. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోపాటు అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను కన్సల్టెంట్లు, వడ్డీల చెల్లింపుల కోసం చంద్రబాబు సర్కారు వ్యయం చేసింది. రాజధానిలో ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణాలను చేపట్టలేదు. అమరావతి బాండ్ల పేరుతో రూ.2,000 కోట్లు అధిక వడ్డీకి అప్పు తీసుకుని అనుత్పాదక కన్సల్టెన్సీలకు రూ.322 కోట్లను చెల్లించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి అథారిటీ నిధి కింద రూ.215 కోట్లు ఉండగా ఇందులో నుంచి రూ.22 కోట్లను కన్సల్టెన్సీలకు చెల్లించింది. రాజధానిలో సచివాలయం, రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1,500 కోట్ల నుంచి చంద్రబాబు సర్కారు రూ.329 కోట్లను వడ్డీల చెల్లింపులకు వెచ్చించడం గమనార్హం.

అప్పు రూ.2,000 కోట్లు.. వడ్డీలు రూ.2,000.82 కోట్లు
విదేశీ, స్వదేశీ బ్యాంకులు ఇచ్చే రుణాలను సంబంధిత ప్రాజెక్టు కోసమే వినియోగించాలి. అయితే ఇష్టానుసారంగా ఖర్చు చేసేందుకు బాండ్ల ద్వారా అప్పులు చేయాలని టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నిర్ణయించారు. దీన్ని అప్పట్లోనే పలువురు ఐఏఎస్‌ అధికారులు తప్పుబట్టారు. ఒకపక్క పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ప్రభుత్వ గ్యారెంటీ లేకుండానే బాండ్లు జారీ చేస్తే కేవలం 9.38 శాతం వడ్డీకే అప్పులు ఇవ్వడానికి భారీగా సంస్థలు ముందుకు వచ్చాయని, కర్ణాటక కూడా 5.85 శాతానికే అప్పులు చేస్తోందని, అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ ఏకంగా అమరావతి బాండ్లకు 10.32 శాతం వడ్డీ చెల్లించాలని ఎలా నిర్ణయిస్తారని అభ్యంతరం తెలిపారు.

బాండ్ల దళారీకి అప్పులో 0.1 శాతాన్ని ఫీజు కింద జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుండగా, అమరావతి బాండ్ల దళారీకి మాత్రం 0.85 శాతం చెల్లించాలని నిర్ణయించడంపై కూడా విస్మయం వ్యక్తమైంది. ఇక అమరావతి బాండ్ల ద్వారా చంద్రబాబు సర్కారు ఎంత అప్పు తీసుకుందో అంతకు మించి వడ్డీలు, ఫీజుల రూపంలో చెల్లించాల్సి రావడం గమనార్హం. అమరావతి బాండ్లకు భారీ వడ్డీ, దళారీ ఫీజుతో కలిపి పదేళ్లలో రూ.2,000.82 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుల భారాన్ని తగ్గించుకుని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగటంపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు 26 నుంచి సర్వే

గేట్లు దాటిన ‘కృష్ణమ్మ’

కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం

కేసీఆర్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

ఈనాటి ముఖ్యాంశాలు

రాయలసీమ అభివృద్ధికి సహకరిస్తాం : కేసీఆర్‌

చంద్రబాబును కలిసిన బోండా ఉమ

ఆ వార్తలను ఖండించిన కోటంరెడ్డి

మణిక్రాంతి మొండానికి అంత్యక్రియలు

అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా..

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

విశాఖ సాగర తీరంలో భారీ అగ్నిప్రమాదం

కొత్త పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?

‘గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులు’

వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై పుస్తకావిష్కరణ

వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు..

బక్రీద్‌ శాంతి సుహృద్భావాలను పెంపొందించాలి

బడిలో ఉన్నా.. లేనట్టే !

కృష్ణా ఉగ్రరూపం.. సాగర్‌ గేట్ల ఎత్తివేత

చేప చిక్కడంలేదు!

టీడీపీ నేతలు.. సాగించిన భూ దందా

ఎక్కడుంటే అక్కడే రేషన్‌..

మాట నిలుపుకున్న సీఎం జగన్‌

గజరాజులకు గూడు.!

ఉల్లంఘనలు..

ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ గెస్ట్‌ హౌస్‌

ఏరులైపారుతున్న సారా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు

ట్రాప్‌లో పడేస్తారు