రూ.3 లక్షల విలువచేసే ఎర్రచందనం పట్టివేత

27 Dec, 2013 11:48 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా(కడప): ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికలను సైతం పట్టించుకోవడం లేదు. స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందకు యత్నించిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టారు.

తాజాగా వైఎస్సార్ జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం వైకోట అటవీ ప్రాంతంలో అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు స్మగ్లర్ను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ సుమారు 3 లక్షల రూపాయల విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎర్రచందనం తరలించిన ట్రాక్టర్ను సీజ్ చేసినట్టు అటవీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు