రైతులకు రూ.96 కోట్ల హుద్‌హుద్‌ పరిహారం

3 May, 2017 03:14 IST|Sakshi
రైతులకు రూ.96 కోట్ల హుద్‌హుద్‌ పరిహారం

మందస(పలాస) :హుద్‌హుద్‌ తుఫాన్‌ నష్టపరిహారం కింద జిల్లాలోని రైతులకు రూ.96 కోట్లను అందజేసినట్టు జిల్లా రిలీఫ్‌ అకౌంట్స్‌ సహాయ ఆడిట్‌ అధికారి ఎం.స్వాతి తెలిపారు. మందస మండలానికి సంబంధించిన హుద్‌హుద్‌ పరిహారం నిధుల పంపిణీ వ్యవహారంపై మంగళవారం తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయానికి రూ.86 కోట్లు, ఉద్యానవనానికి సంబంధించి రూ.10 కోట్లను రైతులకు ఇప్పటికే అందజేశామన్నారు.

మందస మండలంలో 38 పంచాయతీల్లోని 147 మంది రైతులకు రూ.2.5 లక్షలు పంపిణీ చేశామని వివరించారు. ఈ నిధులు రైతులకు చేరాయా.. అక్రమాలు జరిగాయా.. అనే అంశాలపై ఆడిట్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు ఆడిట్‌ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమెతో పాటు మందస ఏఎస్‌ఓ బి.భోగేశ్వరరావు, వీఆర్వోలు నల్ల వైకుంఠరావు, రవీంద్రనాథ్‌ పట్నాయక్‌లు రికార్డులను పరిశీలించారు.

>
మరిన్ని వార్తలు