పోలీసులు కాల్పులు: ఎర్రచందనం స్మగ్లర్లు పరారీ

8 Jun, 2014 08:21 IST|Sakshi

వైఎస్ఆర్ కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల గ్రామ సమీపంలో లోతువంక అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది గత అర్థరాత్రి నుంచి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన స్మగ్లర్లు కూబింగ్ నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. దాంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు స్మగ్లర్లపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

 

దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారైయ్యారు. ఘటనాస్థలంలో స్మగ్లర్ల డంప్ను స్వాధీనం చేసుకున్నారు. డంప్లో 200 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 20 బస్తాలకుపైగా ధాన్యం బస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నాఉ. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువు రూ. కోటిపైగా ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు