విడ్డూరం.. హోంమంత్రికి దారివ్వలేదని

14 Feb, 2018 12:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆర్టీసీ బస్సును పోలీస్‌స్టేషన్‌ తరలింపు

మండిపడ్డ ప్రయాణికులు

సాక్షి, ముమ్మడివరం : తూర్పు గోదావరి ముమ్మడివరం పోలీసులు అత్యుత్సాహం చూపారు. స్వామి భక్తిని నిరూపించుకొనే పని చేశారు. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా.. పోలీసుల అనుకుంటే కేసుల కొదవా అన్నట్లు ముమ్మడివరం పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. బస్సును పోలీస్‌ స్టేషన్ తరలించడం ఏంటి అనుకుంటున్నారా? అవును నిజమే. ఏం జరిగిందంటే.. హోంమంత్రి చిన రాజప్ప జిల్లా పర్యటన నిమిత్తం కాన్వాయ్‌ కాకినాడ - అమలాపురం మార్గంలో వెళ్తోంది.

అదే మార్గంలో నాన్‌స్టాప్‌ సర్వీస్‌ ఆర్టీసీ బస్‌ వెళ్తోంది. రోడ్డులో ఇతర వాహనాలు ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ డైవర్‌ హోంమంత్రి కాన్వాయ్‌కు సైడ్‌ ఇవ్వలేక పోయారు. అంతే హోంమంత్రి దగ్గర స్వామి భక్తి నిరూపించుకొనే అవకాశం వచ్చిందనుకున్నారో ఏమో, ఆర్టీసీ బస్సును  ముమ్మడివరం పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఈ సంఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి దారి ఇవ్వలేదంటూ బస్సును పోలీస్‌ స్టేషన్‌ తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. తాము ఓట్లేసి గెలిపిస్తే  అధికారంలో ఉన్న నాయకులు, ప్రజలను ఇలా ఇబ్బందుల పాలు చేయడం ఏంటని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు