ఆర్టీసీ సేవలకు ‘సమైక్యాంధ్ర’ సెగ

1 Aug, 2013 10:21 IST|Sakshi

సమైక్యాం ధ్ర ఉద్యమ నాయకుల బంద్ పిలుపు ప్రభా వం ఆర్టీసీ సేవలపై పడింది. సర్వీసులు రద్దు చేయక పోయనప్పటికీ వివిధ ప్రాంతాలకు వెళ్లిన బస్సుల రాకపోకలకు ఉద్యమకారులు అడుగడుగునా అడ్డుకోవడంతో  సర్వీసు వేళ ల్లో తీవ్ర ఆటంకం కలిగింది. విశాఖ మార్గమధ్యంలోప్రధాన కూడళ్లలో ఉద్యమకారుల అడ్డగింపువల్ల వెళ్లిన బస్సులు తిరగి జిల్లా కేంద్రానికి రావడానికి నాలుగు నుంచి ఐదు గంటల ఆలస్యం అవుతోంది. అదేవిధంగా పార్వతీపు రం, శ్రీకాకుళం, రాజాం ప్రాంతాల వైపు రాకపోకలు కూడా ఆలస్యంగా నడిచాయి.  దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.


 
 అదే విధంగా ఆర్టీసీకి 40 శాతం ఆదా యంనష్టం వాటిల్లిందని అధికారులు ప్రకటించా రు. వెళ్లిన బస్సులు సకాలంలో రాకపోవడం వల్ల  బస్సుల రద్దీలేక ఆర్టీసీ కాంప్లెక్స్ బోసిపోయింది. ఈ సందర్భంగా విజయనగరం డిపో మేనేజర్ కె.పద్మావతి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో సర్వీసులను రద్దుచేయకుండా సేవలందించామన్నారు. దాదాపుగా అన్ని ప్రాంతాల బస్సుల సర్వీసుల్లో సమయపాలన లోపం వల్ల తీవ్ర ఆటంకం కలిగిందన్నారు. బంద్ పిలుపును ముందస్తుగా ప్రకటించడం వల్ల ప్రయాణికుల తాకిడికూడా తగ్గిందన్నారు.

>
మరిన్ని వార్తలు