ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం

7 Feb, 2016 16:15 IST|Sakshi

 {పచార శిబిరాలు ప్రారంభం
 ఈ నెల 18న ఎన్నికల నిర్వహణ
 నెక్ రీజియన్‌లో 4,214 మందికి ఓటు

 
 విజయనగరం అర్బన్: ఆర్టీసీలో ఎన్నికల సందడి మొదలైంది. సంస్థలో గుర్తింపు కార్మిక సంఘానికి ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నా రు. ఈ  నేపథ్యంలో నార్త్ ఈస్ట్ కోస్టు (నెక్) రీజియన్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల తొమ్మిది డిపో ల్లో పోటీ పడుతున్న ప్రధాన కార్మిక సంఘాలు ప్రచారంలో తలములకలయ్యాయి. రెండోళ్లకోసారి నిర్వహించే ఈ ఎన్నికల్లో సంస్థ గుర్తింపు పొందిన సం ఘాలు 8 వరకు పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఏడా ది కొత్తగా వైఎస్‌ఆర్‌సీపీ అనుబంధ సంఘం వైఎస్‌ఆర్ మజ్దూర్ యూనియన్, టీఎన్‌టీయూసి అనుబంధ సంఘం కార్మిక పరిషత్‌ను రంగంలోకి దిగుతున్నాయి.

 వీటిలో నేషనల్ మజ్దూర్ యూని యన్ (ఎన్‌ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈ.యూ.), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌ల మధ్య మాత్రమే నెక్ రీజి యన్ పరిధిలో ప్రధానంగా పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్ 22న నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఏపీఆర్‌ఈయూ) విజయం సాధించింది. ప్రాంతీయ (రీజియన్ స్థాయి కమిటీ) ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) ఆధిక్యత పొందినా స్థానిక నెక్ రీజయన్‌లో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్ గెలిచింది. ఈ ఏడా ది ఆలస్యంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో అదే రోజు ఓ ట్ల లెక్కింపు జరిగేలా కార్మిక శాఖ ప్రకటన చేసింది.అధికారులు, పర్యవేక్షకులు (సూపర్‌వైజర్లు), భద్రత సి బ్బంది మినహా అంతా ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారు.

 ఒక్కో కార్మికుడు రెండు ఓట్లు వినియోగించుకోవాలి. ఒకటి ప్రాంతీయ (స్థానిక) సంఘానికి, రెండోది రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘం కోసం ఓట్లు వేయాలి. నెక్ రీజియన్ పరిధిలోని 9 డిపోల్లో ప్రస్తుతం ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఎన్నికల్లోనూ మరోసారి విజయం కోసం ప్రస్తుత గుర్తింపు సంఘం ఎంప్లాయీ స్ యూనియన్ ప్రయత్నిస్తోంది. మూడేళ్లుగా చేపట్టిన కార్మిక సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ నేతలు రంగంలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో నెక్ ప్రాంతీయ స్థాయిల్లో ఓటమి చవిచూసిన ఎన్‌ఎంయూ కూడా తమ మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేసింది. ఈ సారి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక డిపో గ్యారేజీ ఆవరణలో రెండు సంఘాల ప్రచార శిబిరాలను ఏర్పాటు చేశారు.   

 నెక్ రీజయన్‌లో 4,214 మందికి ఓటు హక్కు
 నెక్ పరిధిలోని తొమ్మిది డిపోల పరిధిలో 4,214 మంది ఉన్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. విజయనగరం జి ల్లాలోని విజయనగరం డిపో-535 మంది, పార్వతీపు రం డిపో-455, సాలూరు డిపో-369, ఎస్.కోట డిపో-294, ఆర్‌ఎం కార్యాలయం డిస్పేన్షరీ కలిపి 35 మం ది ఓటర్లను గుర్తించారు. అదే విధంగా శ్రీకాకుళం పరి ధిలోని శ్రీకాకుళం-1 డిపోలో 480, శ్రీకాకుళం-2 డిపోలో 494 మంది, పాలకొండ డిపో-530, పలాస డిపో-379, టెక్కలి డిపో-343, డిపోల్లో సిబ్బంది 13 మందిగా ఓటర్లను ఖరారు చేశారు. అదే విధంగా జోన ల్ వర్క్‌షాప్ పరిధిలోని నాన్ ఆపరేషన్ విభాగంలో 287  మంది ఓటు హక్కుకు అర్హులని కార్మిక శాఖకు పంపారు.

మరిన్ని వార్తలు