సమ్మె విరమించండి: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు

6 May, 2015 19:34 IST|Sakshi
సమ్మె విరమించండి: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు

హైదరాబాద్: సమ్మెను విరమించాలని ఆర్టీసీ కార్మికులకు ఆ సంస్థ ఎండీ ఎన్ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లో బస్ భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతం పెళ్లీళ్ల సీజన్, అలాగే వివిధ ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు.

భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల, తిరుపతికి బస్సులు నడిపేందుకు కార్మిక సోదరులు మినహాయింపు ఇచ్చారని  అదే విధంగా విద్యార్థులు, ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సమ్మె విరమించి... బస్సు సర్వీసులను నడపాలని ఆయన కార్మికు సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో 12 వేల ఆర్టీసీ బస్సులు ఉంటే వాటిలో 2 వేలు అద్దె బస్సులు ఉన్నాయని సాంబశివరావు ఈ సందర్బంగా గుర్తు చేశారు. సదరు అద్బె బస్సులు తిప్పు కోవాలని ఇప్పటికే వాటి యజమానులకు చెప్పామని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు