కోవిడ్‌ పరీక్షలు మరింత వేగంగా చేయనున్న ఏపీ

15 Jul, 2020 13:25 IST|Sakshi

సాక్షి,తూర్పు గోదావరి: కాకినాడ హర్బర్ పేటలో ఆర్టీసీ సంజీవని  కోవిడ్  మొబైల్ టెస్టింగ్ సేవలను బుధవారం  ప్రారంభించారు.  ఎంపీ వంగా గీతా,ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి  ఈ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా 200 మంది మత్స్యకారులకు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. ఒకేసారి పది మందికి చొప్పున ముక్కు నుంచి శ్వాబ్‌ను సేకరిస్తున్నారు. వీటి ద్వారా ఫలితాలను అరగంటలో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా రోజుకు 500లకు పైగా పరీక్షలు చేయవచ్చు.ఈ రోజు మూడు సంజీవని కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనాలు జిల్లాకు చేరుకున్నాయి.  రాజమండ్రి, కాకినాడ,అమలాపురం లో పరీక్షలు ప్రారంభమయ్యాయి.  వీటితో పాటు త్వరలో మరో రెండు సంజీవని వాహనాలు జిల్లాకు చేరుకోనున్నాయి. 

చదవండి: ఆ ల్యాబ్‌లో నెగెటివ్‌.. ప్రభుత్వ టెస్ట్‌ల్లో పాజిటివ్‌

మరిన్ని వార్తలు