'ఆర్టీసీ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నాం'

10 May, 2015 18:15 IST|Sakshi

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నామని కార్మిక సంఘం నేత పద్మాకర్ స్పష్టం చేశారు.  ఆదివారం ఏపీ మంత్రివర్గం ఉపసంఘం కార్మిక సంఘాల నేతలతో సమావేశమైనా.. అవి సఫలం కాలేదు. కాగా,  కార్మికుల డిమాండ్లపై మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక ఇచ్చినట్లు పద్మాకర్ తెలిపారు.ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినా భారం పడదని.. తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

 

తమ డిమాండ్ల పరిశీలనకు మూడు వారాల గడువు కోరారని..   అయితే దానిపై ఏపీలోని అన్ని ఇతర సంఘ నేతలు, జిల్లా సమాఖ్యలతో మాట్లాడి నిర్ణయం చెబుతామని పద్మాకర్ తెలిపారు. ఈనెల 12న హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ప్రస్తుతం 60 శాతం బస్సులు తిప్పుతున్నామన్న యాజమాన్యం లెక్కలు అవాస్తవమని.. అది నిజమైతే ఆర్టీసీ ఖాతాలో రూ.9కోట్లు జమ కావాలని.. రూ.10 లక్షల కూడా జమ కాలేదని పద్మాకర్ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు