ఆర్టీసీ టికెట్.. జేబు కట్

6 Apr, 2016 02:03 IST|Sakshi

రేసుగుర్రం సినిమాలో హీరోయిన్ ఎవరు? మహేష్‌బాబు శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ ఎవరు?  సమాధానం మీకు తెలిస్తే వెంటనే కింది నంబరుకు ఫోన్ చేయండి. షరతులు వర్తిస్తాయి. నిమిషానికి రూ.6 స్టాండర్డ్ చార్జీలు వర్తిస్తాయి. డబ్బంటే ఎవరికి చేదు?. అందులోనూ ఊరక వచ్చేదంటే మరీనూ. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి, సినీ జ్ఞానం ఉన్న పలువురు అమాయకులు ఆశతో ఒక ప్రశ్నకు ఠక్కున సమాధానం చెప్పేద్దాంలే..అని ఆర్టీసీ టికెట్ వెనుక ఉన్న ప్రకటనలోని నంబరుకు ఫోన్ చేస్తున్నారు.


ఆ కంప్యూటర్ వాయిస్‌లో వచ్చే వరుస ప్రశ్నలకు వరుసగా సమాధానం చెబుతున్నారు. చివరగా మీ నంబరు మా కంప్యూటర్‌లో నమోదైంది, మీ నంబరుకు ఫ్రైజు వస్తే రూ.లక్ష బహుమానం మీ ఇంటికి పంపుతామన్న చావు కబురుతో ఫోన్ పెట్టేస్తున్నారు. అనంతరం ఫోన్‌లోని బాలెన్స్ మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయి ఉండడాన్ని చూసి అవాక్కవుతున్నారు. ఇలా ఎందరో అమాయకులు బలవుతున్నారు.

 

 

 పుంగనూరుటౌన్:

 ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు సరిపడా చిల్లర ఇవ్వకపోతే కండక్టర్ టికెట్ వెనుక ప్ర యాణికుడికి తిరిగి ఇవ్వాల్సిన నగ దు ఎంత అన్న విషయం రాసి ఇచ్చి.. దిగే సమయంలో తీసుకోమంటాడు. ఇది నిన్నటి వరకు జరుగుతున్న తం తు. కానీ నేడు కండెక్టర్‌కు ఆర్టీసీ ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే టికెట్ వెనుక వైపు మొత్తం వ్యాపార ప్రకటనలను ప్రచురిస్తోంది.   వాటిని నమ్మి ఫోన్ చేసి, పలువురు అమాయకులు తమ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు. సాధారణంగా టికెట్లకు కావాల్సిన ప్రింటింగ్ మెటీరియల్ (పేపర్‌రోల్స్) ఆర్టీసీ బయటి ఏజెన్సీల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ నేడు నష్టాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నష్టాలను తగ్గించుకునేం దుకు ఆర్టీసీ తమ టికెట్ల వెనుక ప్రకటనలు వేసుకోవచ్చని, అందుకు తమ సంస్థకు కొంత మొత్తం చెల్లించాలని ప్రకటించింది. ఈ క్రమంలో పలు సం స్థలు తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి  మొదట కొన్ని వ్యాపారసంస్థలు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత  విడుదలకు సిద్ధమైన సినిమా ల ప్రకటనలు వస్తుండేవి. ఇటీవల కొత్తగా బంగారం గెలుచుకోండి. లక్ష రూపాయలు గెలిచే లక్కీచాన్స్ మీదే అంటూ హైదరాబాద్‌కు చెందిన వాయిస్ సర్వీసెస్ ప్రకటనలు మొదలయ్యాయి. పోనీ ఇంతవరకు ఈ స్కీంలో గెలిచినవారెవరైనా ఉన్నది ఎక్కడా ఎవరికీ తెలియదు. ఫోన్ చేసినపుడు వారు చెప్పిన వెబ్‌అడ్రస్ ఠీఠీఠీ.ఠిౌజీఛ్ఛిట్ఛటఠి జీఛ్ఛిట.జీలో వెతికినా ఆర్టీసీకి వారికి గల సంబంధంపై ఎ లాంటి సమాచారం కానీ, ఫోన్ ద్వా రా సమాధానాలు చెప్పిన వారి వివరాలు గానీ ఏవీ తెలియవు. ఇలా ప్రజ ల ఆశలను పెట్టుబడిగా చేసుకుని కో ట్లాది రూపాయలు ఆర్జించే వారికి ఓ ప్రభుత్వ రంగసంస్థ సహకారం అం దించడమేమిటని సర్వత్రావిమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఇలాంటి మోసపూరిత ప్రకటనలకు ఆర్టీసీ స్వస్తి చెప్పి ప్రజలకు విలువైన సేవలు అందించాలని కోరుతున్నారు.

 

మరిన్ని వార్తలు