ప్రభుత్వ వైఖరిపై ఆర్టీసీ కార్మికుల ఆందోళన

8 Jun, 2017 19:48 IST|Sakshi

అమరావతి: ఆర్టీసీ యాజమాన్యం ఆవలంభిస్తున్న నిర్లక్ష్యనికి ‍వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 14 న రాష్ర్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంస్థ ఎంప్లాయిస్‌ యూనియన్‌ తెలిపింది.

ఆర్టీసీ బస్సుల సంఖ్యను, సిబ్బందిని కుదిస్తున్నందుకు నిరసనగా మొత్తం 13 జిల్లాల్లోని 128 డిపోలు, వర్కుషాపుల వద్ద ఆందోళనలు చేస్తామని ఈయూ పేర్కొంది. యాజమాన్యం సీసీఎస్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌, పీఎఫ్‌ ట్రస్టులకు బకాయి డబ్బులను వెంటనే చెల్లించాలని కోరింది. పెండింగ్ రుణాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు