ఆర్టీపీపీ.. ఉత్పత్తి అరకొర

11 Jul, 2014 02:34 IST|Sakshi

ఎర్రగుంట్ల : వైఎస్‌ఆర్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) లో బొగ్గు కొరత కారణ ంగా ఉత్పత్తి 40 శాతానికి పడిపోయింది. చేసేదేమీ లేకపోవడంతో ఓవ్‌రాలింగ్ పేరుతో అధికారులు ఓక్కోసారి ఒక్కో యూనిట్‌ను నిలుపుదల చేస్తున్నారు.
 
 కొద్ది రోజులు కిందట 20వేల టన్నుల వరకు బొగ్గు నిల్వ ఉండేది. అది ప్రస్తుతం ఐదువేల టన్నుల కు పడిపోయింది. రాష్ట్రాల విభజన జరగడంతో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టుకు తరచు బొగ్గు గండం ఏర్పడుతోంది. దీంతో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి స్తంభించే స్థాయికి ఆర్టీపీపీ చేరుకుంటోంది. ఆర్టీపీపీలో 1,2,3,4,5 యూనిట్లులో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. బొగ్గు కొరత వల్ల యూనిట్లు ఒకదాని తర్వాత ఒకటి ఓవ్‌రాలింగ్ పేరుతో నిలుపుదల చేస్తున్నారు. 15 రోజుల కిందట 1వ యూనిట్‌ను ఓవ్‌రాలింగ్ పనులు నిమిత్తం నిలుపుదల చేశారు. ఈ యూనిట్‌ను గురువారం సర్వీసులోకి తీసుకున్నారు. ఇంతలో మరో యూనిట్‌ను ఓవ్‌రాలింగ్ పనులు కోసం నిలుపుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచరం.
 
 దీన్ని బట్టి చూస్తే బొగ్గు కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మిగిలిన యూనిట్లలో కూడా కేవలం 150 చొప్పున 600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది.
 

మరిన్ని వార్తలు