రూ.10 నాణేలపై దుష్ప్రచారం

25 Mar, 2017 16:00 IST|Sakshi
రూ.10 నాణేలపై దుష్ప్రచారం
► నాణేలపై నిషేధం ఏమీ లేదు- ఆంధ్రా బ్యాంక్‌ డీజీఎం
 
కర్నూలు: రూ.10 నాణేలను కేంద్ర ప్రభుత్వం కానీ, రిజర్వు బ్యాంకు అఫ్‌ ఇండియా కానీ ఎలాంటి నిషేధం విధించలేదు. కనీసం ఆ ఆలోచన కూడా ఆర్‌బీఐకి లేదు. రిజర్వుబ్యాంకు నుంచి యథావిదిగా నాణేలు సరఫరా అవుతున్నాయి. అయితే రూ. 10 నాణేలు చెల్లుబాటు కావన్న పుకార్లు షికార్లు చేస్తుండడంతో చిన్నచిన్న వ్యాపారులు, దుకాణదారులు వాటిని తీసుకునేందుకు జంకుతున్నారు. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యం గా డోన్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం నాణేల చెల్లుబాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రఘునాథ్‌ను వివరణ కోరగా పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావన్నది దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ఏ బ్యాంకుకు వెళ్లినా వాటిని తీసుకుంటారని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఎవ్వరో ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు.
 
 
మరిన్ని వార్తలు