తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

22 Dec, 2017 20:13 IST|Sakshi

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 11 కంపార్టమెంట్లో భక్తులు వేచియున్నారు. సర్వ దర్శనానికి 4 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.93 కోట్లు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను  జేఈఓ శ్రీనివాస రాజు, ఎస్పీ అభిషేక్ మహంతి పరిశీలించారు. 1400 మంది పోలీసులతో టీటీడీ ఏకాదశి రోజున బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి ఏకాదశి దర్శనానికి కంపార్టమెంట్లోకి అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. 72 వేల మంది వేచి ఉండే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు