సేఫ్టీ టన్నెల్‌ నుంచి ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

8 Apr, 2020 15:44 IST|Sakshi

ఎస్‌3 వీ సేఫ్టీ టెన్నెల్‌ను ప్రారంభించిన ఏపీ డీజీపీ

సాక్షి, గుంటూరు: మహమ్మారి కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పలు చోట్ల ఎస్‌3 వీ సేఫ్టీ టన్నెళ్లను ప్రవేశ పెట్టింది. తాజాగా మంగళగిరిలోని  పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దృష్టి సారించారు. సూక్ష్మ క్రిములను నివారించే ఎస్3వీ  సేఫ్ టన్నెల్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి. ఈ టన్నెల్‌లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్‌ను అభివృద్ధి చేసిన కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇకపై డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్‌ నుంచే రావాల్సి ఉంటుంది.
(చదవండి: కోవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌)


(చదవండి: ‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’)

మరిన్ని వార్తలు