స్కూల్ ఆటోలు సురక్షితమేనా?

8 Jun, 2015 02:35 IST|Sakshi
స్కూల్ ఆటోలు సురక్షితమేనా?

- తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టం
- తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి
విశాఖ ఎడ్యుకేషన్:
బడులు తెరుస్తున్నారు. చిన్నారులకు ఉరుకులు పరుగుల జీవితం మళ్లీ మొదలుకానుంది. వారిని స్కూళ్లకు పంపడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. నగరంలో వందల సంఖ్యలో ప్రైవేట్, పబ్లిక్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కార్పొరేట్, ఉన్నత స్థాయి ప్రైవేట్ పాఠశాలలు మాత్రం పిల్లలను స్కూల్‌కి తీసుకుపోయేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నాయి.
 
మిగిలిన పాఠశాలలకు మాత్రం ఆటోల్లోనో, బస్సుల్లోనో వెళ్లాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం తల్లిదండ్రులు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. నగరంలో రెండు వందలకు పైగా ఆటోలు విద్యార్థులను చేరవేస్తున్నాయి. పిల్లలను ఆటోల్లో పంపించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.

- ఆటో నంబరు, డ్రైవర్ ఫోన్ నంబరు తదితర వివరాలు తల్లిదండ్రుల వద్ద ఉండాలి. డ్రైవింగ్ లెసైన్స్ ఉందో లేదూ సరిచూసుకోవాలి.
- సామర్ధ్యానికి మించి పిల్లల్ని ఆటోల్లో ఎక్కించకుండా చూడండి. డ్రైవర్ పక్క సీట్లో పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూర్చోనివ్వకండి.
- స్కూల్ యాజమాన్యం కూ డా పిల్లల్ని తీసుకొచ్చే ఆటో డ్రైవర్ వివరాలు తమ దగ్గర పెట్టుకోవాలి.
- డ్రైవర్ ప్రవర్తన ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. మద్యం సేవించి ఆటోలు నడిపేవారిని, నేర చరిత్ర ఉన్నవారిని దూరం పెట్టాలి.
- పిల్లలు ప్రయాణించే ఆటోలకు సైడ్ ఐరన్ రాడ్స్ అడ్డుగా ఉండే విధంగా చూడాలి.
- ప్రతి రోజు వచ్చే డ్రైవర్ కాకుండా ఒక్కో రోజు కొత్త వ్యక్తులు పిల్లల్ని స్కూల్లో దించడానికి వస్తుంటారు. అలాంటి వారి వ్యక్తిగత సమాచారం పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే పిల్లల్ని పంపించండి.

>
మరిన్ని వార్తలు