సాగర్ అదనపు జలాలు ప్రశ్నార్థకం

11 Sep, 2014 01:24 IST|Sakshi
సాగర్ అదనపు జలాలు ప్రశ్నార్థకం

రైతుల పట్ల పాలకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో వెంగళరాయసాగర్ అదనపు జలాల విషయం గమనిస్తే ఇట్టే అర్ధమవుతుంది. పాలకులెవరైనా... తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పడమే తప్ప... చేసింది అంతంతమాత్రంగానే ఉంది. సాగర్ అదనపు జలాలు ఐదు వేల ఎకరాలకు అందించాలని ఎనిమిదేళ్ల కిందట శంకుస్థాపన చేశారు. అయితే నేటికీ అదనపు జలాలు మాత్రం సాగుకు అందడం లేదు. దీంతో బొబ్బిలి, సీతానగరం మండలాల్లోని ఐదు వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.
 
 బొబ్బిలి : వెంగళరాయసాగర్ అదనపు జలాలు వచ్చే ఏడాది ఖరీఫ్ సాగుకు కూడా అందే పరిస్థితులు కానరావడం లేదు. భూసేకరణ నత్తనడకగా సాగడం, భూసేకరణ కోసం అవసరమైన డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పాటు కాంట్రాక్టర్ల మధ్య సమన్వయలోపం అన్నదాతకు శాపంగా మారాయి. బొబ్బిలి, సీతానగరం మండలాలకు వెంగళరాయసాగర్ జలాశయం ద్వారా అదనంగా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే సదుద్దేశంతో 2006 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ఆర్ రూ.5 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. తరువాత ఆ పనులకు విఘాతం ఏర్పడడంతో ఏడేళ్ల వరకు ప్రతిపాదనలు, అంచనాలు, టెండ ర్లు దశ అంటూ నాన్చి చివరకు అంచనాలను రూ.11 కోట్లకు తీసుకువచ్చారు. చివరకు గత ఏడాది నిధులు మంజూరై విడుదలయ్యూయి.
 
 దాంతో ఈ ఏడాది ఖరీఫ్‌కు సాగునీరు వస్తుంద ని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. ఈ అదనపు జలాలను హైలెవల్ కెనాల్ ద్వారా మూడు వేల 600 ఎకరాలకు, గొల్లపల్లి లింకు ఛానల్ ద్వారా 700 ఎకరాలకు, 5ఏఆర్ మైనర్ కాలువ ద్వారా 677 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమా రు 40.35 ఎకరాల స్థలం కావాలని గుర్తించా రు. ఇప్పటికే 20.29 ఎకరాలను సాగునీటి అధికారులకు అప్పగించారు. వాటికి సంబంధించి చెల్లింపులు కూడా రైతులకు చేశారు. ఇంకా 20.06 ఎకరాలకు భూసేకరణ జరగాల్సి ఉంది. వీటి చెల్లింపులకుగాను రూ.28 లక్షలు కావాలని భూసేకరణ విభాగం నీటి పారుదల శాఖకు అడిగింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వా ల్సి ఉంది. ఇప్పటి వరకు బొబ్బిలి పట్టణ శివారున ఉండే భైరవసాగరం గట్టు ఎత్తు, వెడల్పు చేయడం, రెండు కల్వర్టులను ఏర్పాటు చేశారు. వాకాడ గ్రామం వద్ద కిలోమీటరు కాలువను తవ్వి వదిలేశారు.
 
 వాస్తవానికి హైలెవల్ కెనాల్ ద్వారా 13 కిలోమీటర్ల పొడవునా కాలువలు తవ్వాల్సి ఉంది. సీతానగరం మం డలం లచ్చయ్యపేట, వెన్నెల బుచ్చంపేట, కోటసీతారాం పురం, బొబ్బిలి మండలం కింతలివానిపేట, కలవరాయి, వాకాడవలస, చింతాడ, రాముడువలసకు సాగునీరు అందాలి. గొల్లపల్లి లింక్ ఛానల్ ద్వారా భైరవసాగరం, గొల్లపల్లి వెంగళరాయగారి చెరువుల కింద ఉన్న 700 ఎకరాల ఆయకట్టుకు నీరందాలి. 5ఏఆర్ మైనర్ కాలువల ద్వారా సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా కాలువలు తవ్వాలి. దీని వల్ల గున్నతోట వలస, రంగరాయపురం, మెట్టవలసకు 677 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రస్తు తం భైరవసాగరం వద్ద మొదలు పెట్టిన పనిని అసలు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్‌కు ఇవ్వడం వల్ల చెల్లింపులు సరిగా జరగక వివాదం నెలకొ ని పనులు మధ్యలోనే నిలిచిపోయిన పరిస్థితి. అదనపు ఆయకట్టులో రెండు స్లూయిస్ కల్వర్టులు, పది రోడ్డు కల్వర్టులు, కిలోమీటరు పొడవునా వయూడక్ట్ వంటివి ఇంకా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి ఈ పనులేవి సగభాగం కూడా పూర్తి కాలేదు. కిలోమీటరు కాలువ తప్పించి ప్రగతి లేకపోవడంతో వచ్చే ఖరీఫ్‌కు కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. రూ.11 కోట్లకుఇప్పటికి రూ.28 లక్షలే ఖర్చయినట్టు అధికారు లు చెబుతున్నారు. నిధులున్నా పనులు జరగక పోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.  
 

మరిన్ని వార్తలు