ఏడాదిలో పది రోజులు తప్ప..

29 May, 2020 19:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పూర్తిగా ప్రజా సంక్షేమం మీదనే ధ్యాసపెట్టారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకనే దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యంకాని పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనపై అభినందనలు తెలిపారు. (సీఎం వైఎస్‌ జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌)

‘ఏడాది కాలంలో ఏం చేశామో గత ఐదు రోజులుగా సీఎం జగన్‌ నిజాయితీగా సమీక్షించుకున్నారు. నేలవిడిచి సాముచేయలేదు. అరచేతిలో వైకుంఠాలు చూపలేదు. భ్రమింపచేసే మాటలూ చెప్పలేదు. నిజాయితీగా, నిబద్ధతతో చేసినవాటిని చెప్తూ వినమ్రతతో సలహాలు సూచనలు తీసుకున్నారు. ఏడాది కాలంలో వ్యక్తిగత అవసరాల కోసం వారంపది రోజులు తప్ప పూర్తిగా పనిమీదే తదేక దృష్టి, ధ్యాసపెట్టారు. అందుకనే దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని కార్యక్రమాలు చేపట్టారు. తొలి ఏడాదిలోనే మేనిఫెస్టో దాదాపుగా పూర్తిచేశారు. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసి పునాదులు వేశారు. వీటి అమలును పటిష్టం చేసుకుంటూ నీటిపారుదల పరంగా, పారిశ్రామికంగా, విద్యా వైద్యరంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలోనే నంబర్‌ వన్‌ చేసే దిశలో అడుగులేస్తున్నారు.’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. (మోదీ, జగన్‌ మధ్య సత్సంబంధాలు)

మరిన్ని వార్తలు