బాధితులకు అండగా నిలవండి

22 May, 2020 17:57 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ విజయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో మార్పు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ విజయ వార్షికోత్సవం సందర్భంగా ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేయొద్దని.. సేవా కార్యక్రమాలు మాత్రమే చేయాలని కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. ఈ నెల 23 నుంచి 30 వరకు పార్టీ జెండా ఆవిష్కరణలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తొలుత భావించామని.. కానీ కరోనా నేపథ్యంలో రాజకీయ పరమైన కార్యక్రమాలు నిర్వహించడం మంచిది కాదని, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించవద్దని ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశించారని ఆయన వెల్లడించారు. పార్టీ శ్రేణులు గమనించాలని కోరారు.
(విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత)

పండ్లు పంపిణీ, తదితర సేవా కార్యక్రమాలు చేయదలిచిన వారు లాక్‌డౌన్ నిబంధనల మేరకు.. ప్రత్యక్షంగా పాల్గొనకుండా స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, వార్డు వాలంటీర్ల ద్వారా బాధితులకు సాయం అందించాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాధితులకు అండగా నిలవాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
(దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..)

 

>
మరిన్ని వార్తలు