పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి

5 Jan, 2019 15:46 IST|Sakshi

సాక్షి ఎఫెక్ట్‌.. స్పందించిన అధికారులు

రూ. 13 కోట్ల మేర అవినీతి

రాళ్ల క్వారీలో జీడిమామిడి తోటలున్నట్లు నమోదు

సాక్షి, పశ్చిమగోదావరి : పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి బయపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలవరంలో తెలుగు తమ్ముళ్ల అవినీతిపై గత నాలుగైదు నెలలుగా సాక్షి టీవీలో వరుస కథనాలు ప్రచురితమవడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సాక్షి కథనాలతో విచారణ చేపట్టిన ఐటీడీఏ పీఓ హరీంద్రయ ప్రసాద్‌ దాదాపు రూ. 13 కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించారు. జంగారెడ్డి గూడెం మండలం తాడువాయి, చల్లా వారి గూడెం, మంగి శెట్టి గూడెం తదితర గ్రామాల్లో సేకరించిన 1000 ఏకరాల భూమిలో తెలుగు తమ్ముళ్ల అవినీతి బట్ట బయలైంది.

రాళ్ల క్వారిలో జీడిమామిడి తోట ఉన్నట్లు.. పామాయిల్‌ తోటలో కోకో తోటలు ఉన్నట్లు, లేని టేకు, వేప చెట్లను ఉన్నవాటిగా నమెదు చేసి కోట్ల రూపాయలు మింగిన వైనం తెరమీదకొచ్చింది. పోలవరంలో జరిగిన అవినీతి నిరూపణ కావడంతో పీఓ హరీంద్రయ ప్రసాద్‌ ఇప్పటికే 8 మంది ఉద్యోగులను సస్సెండ్‌ చేశారు. దాంతో పాటు కొందరు టీడీపీ నేతలకు రికవరీ నోటీసులు పంపించి.. సొమ్ము చెల్లించపోతే కఠిన చర్యలుంటాయిని హెచ్చరించారు. అయితే అవినీతికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మీన మేషాలు లెక్కిస్తుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు