‘సాక్షి’ స్పెల్‌బీ ఓవరాల్ చాంపియన్‌గా చిరక్ పబ్లిక్ స్కూల్

28 Jan, 2014 03:23 IST|Sakshi
‘సాక్షి’ స్పెల్‌బీ ఓవరాల్ చాంపియన్‌గా చిరక్ పబ్లిక్ స్కూల్

సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ‘సాక్షి’ ఇండో స్పెల్‌బీ-2013 గ్రాండ్ ఫినాలె పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాలుగు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందజేశారు.
 
 ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ.రెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్పీ.రెడ్డి, ఆంధ్రబ్యాంక్ జీఎం టీవీఎస్ చంద్రశేఖర్, డీజీఎం అమర్‌నాథ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు జ్ఞాపికలతో పాటు చెక్కులను బహూకరించారు. కొండాపూర్‌లోని చిరక్ పబ్లిక్ స్కూల్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో స్పెల్‌బీ మాస్టర్ విక్రమ్, స్పెల్‌బీ సీఈవో శంకర్‌నారాయణ, సాక్షి మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.  
 
 హా    కేటగిరీ-1లో 21 మంది విద్యార్థులు పోటీపడగా, మొదటి బహుమతి చిరక్ స్కూల్‌కు చెందిన రియాసిన్హా గెలుపొందగా, రెండో బహుమతిని చిరక్ స్కూల్‌కు చెందిన ఆర్యన్‌తనేజ్, మూడో బహుమతి జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ విద్యార్థి శ్రేయాస్ భార్గవ గెల్చుకున్నారు.
 హా    కేటగిరీ 2లో 20 మంది పాల్గొనగా, మొదటి బహుమతిని చిరక్ స్కూల్‌కు చెందిన స్నిగ్ధా మిశ్రా, రెండో బహుమతిని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన సిద్ధార్థ్ వీరపనేని, మూడో బహుమతిని కెన్నడీ గ్లోబల్ స్కూల్‌కు చెందిన ఉదిత గెలుపొందారు.
 హా    కేటగిరీ 3లో 21 మంది పోటీపడగా, మొదటి బహుమతిని చిత్తూరులోని క్యాంఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్‌కు చెందిన కె. పూజిత, రెండో బహుమతి గీతాంజలి దేవ్‌శాల స్కూల్‌కు చెందిన మృణాల్ కుటేరి, మూడో బహుమతి గీతాంజలి దేవ్‌శాల స్కూల్‌కు చెందిన సాయికీర్తన గెలుపొందారు.
 హా    కేటగిరీ 4లో 21 మంది పోటీపడగా మొదటి బహుమతి వీటీ హైస్కూల్ వైజాగ్‌కు చెందిన రోహిత్, 2వ బహుమతిని డీపీఎస్ వైజాగ్‌కు చెందిన అంకితాదాస్, 3వ బహుమతి  బృందా(కేకేఆర్ స్కూల్) సాధించారు.

మరిన్ని వార్తలు