ఈనాటి ముఖ్యాంశాలు

3 Aug, 2019 20:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రస్తు‍త పరిస్థితులపై ఆయన సమాచారం కోరారు.  సీఎం కార్యాలయ అధికారులు.. ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఉభయ గోదావరి ప్రాంత పరిస్థితులను వివరించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామాగ్రి అందించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

చంద్రబాబు జ్ఞానం మసకబారుతోందనే అనుమానం కలుగుతోందని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. పబ్లిసిటీ కోసం ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. బందరు పోర్టును తెలంగాణకు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల వసతి గృహాల్లో భోజన సదుపాయం కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ సక్రమంగా అమలు చేయకపోతే సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి హెచ్చరించారు. అచ్చంపేట మండలం నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించేందుకు వెళ్తున్న టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన హజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అరెస్టు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు