ఈనాటి ముఖ్యాంశాలు

4 Aug, 2019 19:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం ఇజ్రాయెల్‌లోని హదెరా నీటిశుద్ధి ప్లాంట్‌ను సందర్శించారు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ గురించి ఈ సందర్భంగా ప్లాంట్‌ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు వ్యయం, నిర్వహణా వ్యయాల గురించి సీఎం అక్కడి అధికారులను ఆరా తీశారు.ఎడతెరిపిలేని వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత వరద ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. తాగునీరు, కిరోసిన్, బియ్యం, కందిపప్పు అందిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు లేవని, ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. దేశ ఆర్థిక, వినోద రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోతతో మహానగరంలో జనజీవనం స్ధంభించింది. భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలకు అనుగుణంగా ఆదివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తడంతో రోడ్డు, రైలు రవాణాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. 

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి.. 

>
మరిన్ని వార్తలు