సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు పెంచాలి

5 Jun, 2018 12:54 IST|Sakshi
కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న యూనియన్‌ నేతలు

సాక్షి, ఒంగోలు అర్బన్‌ : సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు 50 శాతం పెంచుతూ వెంటనే జీఓను వెంటనే విడుదల చేయాలని ఏపి స్టేట్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్, సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి రావూరి దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ జీఓ 151 వచ్చినా 2014 నుంచి వేతనాలు, అరియర్స్‌ చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. గ్రాడ్యుయుటీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా సహకార సిబ్బందికి హెల్త్‌ కార్డులు ఇవ్వాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ధర్నాకు పెంట్యాల హనుమంతరావు, నాయకులు కె. లక్ష్మీనారాయణ, షేక్‌ మౌళాలి, శ్రీకాంత్, ఈశ్వర్, రామాంజనేయరెడ్డి, రత్నకుమారి, పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు