ఉప్పుతో నిండిపోయిన పులికాట్‌

17 Apr, 2019 09:57 IST|Sakshi
సూళ్లూరుపేట–శ్రీహరికోట మార్గంలో ఉప్పుతో కప్పేసి శ్వేతవర్ణ సరస్సులా మారిన పులికాట్‌

సాక్షి, సూళ్లూరుపేట: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా పేరు ప్రఖ్యాతులున్న పులికాట్‌ సరస్సు కరువు కాటకాలు, ముఖద్వారాల పూడికతో నీళ్లు రాకపోవడంతో ఉప్పుతో నిండిపోయి శ్వేతవర్ణ సరస్సులా గోచరిస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట–శ్రీహరికోటకు వెళ్లే రోడ్డులో సరస్సు ఎటువైపు చూసినా తెల్లటి ఉప్పుతో నిండిపోయి మంచు దుప్పటి పరుచుకున్నట్టుగా కనిపించడంతో పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.

గడచిన రెండేళ్లుగా సరస్సుకు తగినంత వరద నీరు చేరకపోవడంతో పాటు సముద్ర ముఖద్వారాలనుంచి కూడా నీళ్లు రాకపోవడంతో ఇలా మారింది. ఇందులో శ్రీహరికోట రోడ్డుకు దక్షిణం వైపు సరస్సు లోతుగా ఉండడం, తమిళనాడులోని పల్‌వేరికాడ్‌ ముఖద్వారం నుంచి నీళ్లు రావడంతో అక్కడ ఓ మోస్తరు నీళ్లున్నాయి. ఉత్తరం వైపు రాయదొరువు ముఖద్వారం నుంచి నీళ్లు రాకుండా ఆగిపోవడంతో సరస్సు ఉప్పు మయంగా మారింది. దీంతో సరస్సు అంతా ఎటువైపు చూసినా శ్వేతవర్ణంగా మారింది. వేసవిలో ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన ఉప్పును తీరప్రాంత గ్రామాలకు చెందిన వారు తీసుకెళ్లి వాడుకుంటుంటారు.

మరిన్ని వార్తలు