సామీ.. ఇదేమి దుర్గతి

1 Nov, 2013 03:28 IST|Sakshi

 

 =అపరిశుభ్రంగా అఖిలాండం
 =విరిగిన రాతిబండలు
 =పనికిరాకుండా పోయిన కర్పూర దీప స్తంభాలు

 
తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి  ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం దుస్థితికి చేరుకుంది. కొబ్బరికాయలు కొట్టే బండరాళ్లు రెండుగా పగిలిపోయాయి. కర్పూరం వెలిగించే దీపపు స్తంభాలు విరిగి, మసిబారి పనికి రాకుండా పోయాయి. అఖిలాండం చుట్టూ పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. దీన్ని చూసి భక్తులు అసంతృప్తికి గురవుతున్నారు.
 
సాక్షి, తిరుమల: భూ వరాహస్వామి, వేంకటేశ్వరస్వా మిని దర్శించుకున్న ప్రతి భక్తుడూ అఖి లాండం వద్ద కర్పూరం వెలిగించి, కొబ్బరికాయలు కొట్టడం సంప్రదాయం. 2003 ముం దు వరకు గొల్ల మండపం వద్ద ఉన్న అఖి లాండాన్ని వేయికాళ్ల మండపం తొలగించ డం, సన్నిధి వీధి దుకాణాలను మార్పు చేసిన సమయంలో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పునఃనిర్మించారు. పదేళ్లు గడిచినా టీటీడీ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఈ ప్రదేశం దుస్థితికి చేరు కుంది. నిత్యం ఇక్కడ పది వేల నుంచి 20వేల వరకు కొబ్బరికాయలు కొట్టడం వల్ల రాతి బండలు పగిలిపోయాయి. మరి కొన్ని బండరాళ్లు విడిభాగాలు ఊడిపోయాయి. దీనివల్ల కొబ్బరికాయలు కొట్టేం దుకు భక్తులకు వీలులేకుండా పోతోంది. 200 నుంచి 300 కేజీల వరకు కర్పూరం వెలి గించడం వల్ల దీపపు స్తంభాలు విరిగిపోవడం, రంధ్రాలు పడడం, మసిబారిపోవడంతో పనికిరాకుండా పోయాయి.
 
 రోజూ టన్నుల కొబ్బరి లభ్యం


 శ్రీవారి అఖిలాండం వద్ద రోజూ టీటీడీకి  రెండు నుంచి మూడు టన్నుల కొబ్బరి లభిస్తోంది. కొబ్బరి చిప్పలను రెండురోజులకొకసారి సేకరించి, నిత్యాన్నదాన సముదాయానికి తరలించి వంటల్లో వాడుతారు. ఆలయంలోకి వెళ్లలేని భక్తులు అఖిలాండం వద్ద ఉన్న హుండీలో కానుకలు, పత్రాలు సమర్పిస్తుం టారు. వాటిని కూడా టీటీడీ సేకరించి ఆల యానికి తరలిస్తోంది.
 
 పట్టించుకోని అధికారులు

 రోజూ 20 వేల మంది పైగా భక్తులు సందర్శించే   అఖిలాండం అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొబ్బరికాయల నీరు, కర్పూరపు పొగ, మసి, ఇతరత్రా వ్యర్థ పదార్థాల వల్ల పరిసరాలు దుర్గంధంతో నిండుతున్నాయి. ఈగల మోత పెరిగిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
 

మరిన్ని వార్తలు