సంపూర్ణేష్‌ బాబు సందడి 

5 Jan, 2020 10:04 IST|Sakshi
హీరో సంపూర్ణేష్‌ బాబుపై క్లాప్‌ కొడుతున్న ఏఎంసీ మాజీ చైర్మన్‌ మారం వెంకారెడ్డి  

సాక్షి, చీమకుర్తి: సీనీ నటుడు సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటిస్తున్న ప్రొడక్షన్‌ నంబర్‌–1 సినిమా షూటింగ్‌ శనివారం సంతనూతలపాడులోని కృష్ణసాయి గ్రానైట్‌ ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగింది. గ్రానైట్‌ యజమాని శిద్దా వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మారం వెంకారెడ్డి సంపూర్ణేష్‌ బాబుపై క్లాప్‌ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. కేఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నూతన తార నటించనున్నట్లు యూనిట్‌ నిర్వాహకులు తెలిపారు. పృథీ్వ, షియాజీ షిండే, కత్తి మహేష్‌, తనికెళ్ల భరణి, సుధాతో పాటు పలువురు తారాగణం ఈ సినిమాలో నటించనున్నారని తెలిపారు. సినిమాకి మాటలు మరుదూరి రాజా రచిస్తుండగా కెమెరామెన్‌గా అడుసుమల్లి విజయ్‌కుమార్, ఎడిటింగ్‌ గౌతమ్‌రాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా అలవలపాటి శేఖర్, నిర్మాతలుగా ఎస్‌ శ్రీనివాసరావు, నారాయణ, చిరంజీవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎన్‌.హరిబాబు చేస్తున్నట్లు తెలిపారు. సినిమా షూటింగ్‌ చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు