ఇకపై ఏపీలో ఇసుక డోర్‌ డెలివరీ

30 Dec, 2019 14:34 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: సామాన్యులకు సకాలంలో ఇసుకను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇక నుంచి ఏపీలో ఇసుక డోర్‌ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు జరపనుంది. జనవరి 7న తూర్పుగోదావరి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో డోర్‌ డెలివరీ చేయనున్నారు. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో డోర్‌ డెలివరీ అమలు చేయనున్నారు. ర్యాంపుల్లో ఏవిధమైన దోపిడీకి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో వినియోగదారులకు సకాలంలో ఇసుక లభ్యమవుతోంది.

మరిన్ని వార్తలు