కోట్లకు 'రీచై' పోతున్నారు

28 Jan, 2016 09:11 IST|Sakshi
 
‘మన మహిళా సంఘాలే ఇసుక అందిస్తారుు. దళారీ వ్యవస్థతో పని లేదు’ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడి మాట. నూతన ఇసుక పాలసీ 2014ను ప్రవేశ పెట్టినప్పుడూ మళ్లీ ఇదే మాటను ఉటంకించారు. ...  
ఆ మాటలో నిజం ఉందనుకున్నారు జనం. తొమ్మిదేళ్ల తరువాత పీఠం ఎక్కిన బాబు అంతా మంచే చేస్తారని భావించారు. కానీ జరిగింది మాత్రం ఇందుకు భిన్నం. అంతా దళారీ వ్యవస్థతోనే తెలుగు తమ్ముళ్లు ఇసుక రీచ్‌లను కైవసం చేసుకొని రూ.కోట్లలో ఆర్జించారు. జిల్లా అధికారులు సైతం నోరు మెదపని పరిస్థితి. దీంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ధరే తడిసిమోపెడై కూర్చుంది. 
 
 
  2014 ఇసుక పాలసీ చాటున దందా 
  డ్వాక్రా గ్రూపులను దోషులుగా చూపిన వైనం
  ఇప్పటికే కొల్లగొట్టిన ఇసుకాసురులు
  పాత సీసాలో కొత్త సారా 2016 పాలసీ
  జిల్లాలోని ఇసుక రీచ్‌లు వేలానికి
    పనికిరావంటూ ప్రకటన
  అరుునా ఆగని అక్రమ దందా
  అధికార పార్టీ నాయకులదే హవా
  కళ్లకు గంతలు కట్టుకున్న యంత్రాంగం 
 
2014 ఇసుక పాలసీ అటకెక్కింది. తిరిగి కొత్తగా 2016 పాలసీ తెరపైకి వచ్చింది. జిల్లాలో ఉన్న ఇసుక రీచ్‌లేవీ ఈ-వేలానికి పనికి రావని అధికారులు తేల్చారు. జిల్లాలో ఉన్న చిన్న నదులు, ఏరులు, వాగులు మూడో కేటగిరీ కిందకు వస్తాయని, వీటిలో నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి ఈ-వేలం పద్ధతి అనుకూలించదని తేల్చి చెప్పారు. మండలాల స్థాయిలో స్థానికంగా ఉండే వారు ఇసుక అవసరాలు తీర్చుకోవాలంటే ఎడ్లబండ్లతో రవాణా చేసుకోవాలని ప్రకటించారు. చంద్రబాబునాయుడు సీఎం అయ్యూక ఇసుక పాలసీల పేరిట ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నారుు. దీంతో సామాన్యుడు మొదలుకొని పెద్ద నిర్మాణ సంస్థల వరకూ అల్లాడిపోతున్నారు. నల్లబజారులో ఇసుక రాజ్యమేలుతోంది. ఎలా అంటే... 
 
ఒంగోలు క్రైం: జిల్లాలో అవినీతి పరుల గుప్పెట్లో ఇసుక ఇరుక్కుపోరుుంది. పాలసీల మాటున అక్రమార్జనలకు తెరలేపుతున్నారు. ‘ఊరు మనదే దోచేయ్’ అన్న రీతిలో నిబంధనలు తుంగలో తొక్కి మదపుటేనుగుల్లా రీచ్‌ల వైపు అడుగులేస్తున్నారు. 2014 ఇసుక పాలసీ వల్ల జిల్లాలో రూ.20 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుకను సరఫరా చేసేందుకు నిర్ణయించిన ఆ పాలసీ అధికార పార్టీ నాయకులకు వరంగా మారింది. 2016 నూతన ఇసుక పాలసీని కూడా అదే రీతిలో తమ చేతుల్లోకి తీసుకొని  కొల్లగొట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఉన్న పదిహేను రీచుల్లో ఏ ఒక్కటీ ఈ-వేలం ద్వారా ఇసుక అమ్మకానికి పనికి రాదని తేల్చినా అక్రమాలు ఆగడం లేదంటే అధికారులు ఏ స్థారుులో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి దాడులు చేశామని చేతులు దులుపుకోవడమే తప్ప అసలు సూత్రధారుల జోలికి పోకపోవడమే ఇందుకు ఉదాహరణ. జిల్లాలో నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు తెలుస్తోంది. క్యూబిక్ మీటర్ రూ.500 చొప్పున వేసుకున్నా రూ.20 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని పరిశీలకులు భావిస్తున్నారు.   
 
 కందుకూరు నియోజకవర్గంలోనే 15 రీచ్‌లు...
జిల్లాలోని పదిహేను ఇసుక రీచ్‌ల్లో ఏడు ఇసుక రీచ్‌లు కందుకూరు ని యోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. అక్కడ అధికార పార్టీకి చెందిన మాజీ ప్రతినిధి ఏకంగా ఇసుక దందా నిర్వహించి కోట్లలో వెనుకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
బద్దిపూడి, దొండపాడు, భీమవరం, మాచవరం, మన్నేటికోట, పలుకూరు, విక్కిరాలపేట ఇసుక రీచ్‌ల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక ఇప్పటికే అక్రమంగా తరలిపోయింది. ఈ రీచ్‌ల నుంచే రెండు లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుక అక్రమార్కుల పాలైంది. చక్రాయిపాలెం, కె.బిట్రగుంట, మద్దిరాలపాడు, మల్లవరం, నందిపాడు, పాదర్తి, గుండ్లకమ్మ, కలవళ్ళ వద్ద ఉన్న వీఆర్ ఆనకట్ట ఇసుక రీచ్‌ల నుంచి కూడా లక్షలాది క్యూబిక్ మీటర్లు ఇసుకకు కాళ్లొచ్చాయి.
 
వాస్తవానికి జిల్లాలో 2014 ఇసుక పాలసీ అమలు సమయంలో 5,83,800 క్యూబిక్ మీటర్లు ఇసుక నిల్వలున్నట్లు అంచనాలు వేశారు. అయితే ఆ పాలసీ ముగిసే నాటికి 2,30,339 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారికంగా విక్రయించారు. అంటే అధికారులు అంచనాలు వేసి నిల్వ ఉందని తేల్చిన ఇసుక కంటే ఎక్కువగానే అక్రమంగా తరలించినట్లు స్పష్టమవుతోంది. 
 
 సీసీ కెమేరాలూ పీకేశారు...
ఇసుక రీచ్‌ల వద్ద అక్రమాలను అరికట్టేందుకు సొసైటీ ఎలిమినేషన్ ఆఫ్ రూ రల్ పవర్టీ (సెర్ఫ్) ఆధ్వర్యంలో నిఘా కోసం కొన్ని రీచ్‌ల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇసుక రీచ్‌ల్లో ఏర్పాటు చేసిన విక్కిరాలపేట, మల్లవరం వద్ద సీసీ కెమేరాలు హార్డ్ డిస్క్‌లతో సహా అపహరించుకుపోయారు. అధికార పార్టీ నాయకులు అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని తమ అనుచరుల ద్వారా ఈ పని చేరుుంచారు.
 
మరిన్ని వార్తలు