ఇసుక రవాణాకు గ్రీన్‌సిగ్నల్‌

5 Aug, 2019 12:04 IST|Sakshi
విడవలూరు: ముదివర్తి ఇసుక రీచ్‌లో ట్రాక్టర్‌కు ఇసుకను లోడ్‌ చేస్తున్న కూలీలు 

14 రీచ్‌లలో ఇసుక  తవ్వకాలకు అనుమతి

500 పైగా వాహనాలతో సరఫరా

జిల్లాలో భవన నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా అధికారులు అనుమతులు చకచకా ఇచ్చేస్తున్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక కావాలంటూ దరఖాస్తు చేసుకుంటే చాలు.. వెంటనే  రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు నిర్మాణాలను పరిశీలించి అనుమతులు చేతికిచ్చేస్తున్నారు. దీంతో ఇసుక రవాణాదారులు రీచ్‌ల వద్ద  బారులు తీరుతున్నారు. రీచ్‌లలో ఉచితంగానే ఇసుక దొరకతుండడంతో భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి.

సాక్షి, నెల్లూరు: జిల్లాలో పర్యావరణ అనుమతులు ఉన్న 14 ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించి ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చేశారు. జిల్లాలోని నెల్లూరురూరల్‌ మండలం సజ్జాపురం రీచ్‌ 1,2లో 5,375  హెక్టార్లకు గాను 46,168 క్యూబిక్‌ మీటర్లు ఇసుక తవ్వకాలకు, పొట్టేపాళెంలోని నాలుగు రీచ్‌లలో 18,367 హెక్టార్లకు గాను 1,83,670 క్యూబిక్‌ మీటర్ల ఇసుక, గొల్ల కందుకూరులో రీచ్‌లో 3,840 హెక్టార్లకుగాను 38,042 క్యూబిక్‌ మీటర్ల ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని మినగల్లు రీచ్‌లో 2,792 హెక్టార్లలో 27,924 క్యూబిక్‌ మీటర్లు ఇసుక, ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం 1,2 రీచ్‌లలో 27,049 హెక్టార్లకుగాను 1,72,,496 క్యూబిక్‌ మీటర్లు ఇసుక రవాణా, అనంతసాగరం మండలంలోని లింగంగుంటలో 1,570 హెక్టార్లలో 15,700 క్యూబిక్‌ మీటర్లు ఇసుక,  అదే మండలంలోని పడమటి కంభంపాడులో 4,451 హెక్టార్లలో 44,517 క్యూబిక్‌ మీటర్లు, విడవలూరు మండలంలోని ముదివర్తిలో 2,509186 దరఖాస్తులకు అనుమతులు

జిల్లాలోని భవన నిర్మాణాలకు సంబంధించి 186 దరఖాస్తులకు ఇసుక రవాణాకు రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అనుమతులిచ్చారు. మరో 70 వరకు దరఖాస్తులు రాగా పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉన్నాయి. స్థానికంగా పేదలకు అవసరమయ్యే ఇసుక తోలకాలకు సంబంధించి ఎడ్లబండ్లకు స్థానికంగానే రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారన్నారు. ఇప్పటికే దాదాపు 500 వాహనాలకు ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతులు ఇచ్చేశారు. అపార్ట్‌మెంట్లు, మేనకూరు సెజ్, షార్‌ కేంద్రం, శ్రీసిటీలో జరిగే భారీ నిర్మాణాలకు మాత్రం రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల పరిశీలన చేసి ఆపై జిల్లా కలెక్టర్‌ ద్వారా అనుమతి ఇస్తున్నారు. కలెక్టర్‌ సైతం ఇసుక దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా అనుమతులు చకచకా ఇస్తుండడంతో ఇసుక కొరత లేకుండా సరఫరా జరుగుతోంది. హెక్టార్లలో 25,091 క్యూబిక్‌ మీటర్లు ఇసుక, పొదలకూరు మండలంలోని విరువూరులో 4,694 హెక్టార్లలో 46,945 క్యూబిక్‌ మీటర్లు ఇసుక రవాణా కు అనుమతులు ఇవ్వడంతో ఇసుక రవాణా వేగవంతంగా జరుగుతోంది.ఉచితంగా ఇసుక సరఫరా 

జిల్లాలో 14 రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులిచ్చాం. ఇసుక రవాణా అనుమతులను పారదర్శకంగా ఇచ్చాం. ఎక్కడా కూడా అనుమతులకు నగదు వసూళ్లు చేసినట్లు ఒక్క ఆరోపణ కూడా రాలేదు. అనుమతులు చకచకా ఇచ్చేయడంతో  ఇసుక కొరత లేకుండా రవాణా సాగుతోంది. అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు మాత్రం తప్పక పరిశీలన చేసి అనుమతులు ఇస్తున్నాం. త్వరలో నూతన పాలసీ వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఆరు రీచ్‌లకు ఇసుక రవాణాకు టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు.
– వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్‌ ఏడీ

మరిన్ని వార్తలు