బేరం కుదిరింది!

17 Jan, 2014 06:18 IST|Sakshi

సాక్షి, హన్మకొండ : అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఊరుకోం.... కేసులు పెడతాం... జరిమానాలు విధిస్తాం.... పోలీస్, రెవెన్యూ అధికారులు చెప్పిన మాటలివి. ఈ హెచ్చరికలు మూన్నాళ్ల ముచ్చటగానే మారారుు. మాఫియూతో సయో ధ్య కుదరడంతో నిబంధనలు సైతం ఇసుకలోనే కలిసిపోయూరుు. పట్టుమని పది రోజులు కాలే దు... అధికారులు  తోకముడవడంతో ఇసుక అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు... ఆరు ట్రిప్పులు అన్నట్లుగా సాగుతోంది.
 
 ఆకేరు దందాకు అడ్డే లేదు
 స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల గుం డా ఆకేరు వాగు ప్రవహిస్తోంది. ఈ వాగుకు సంబంధించిన ఇసుకు మాఫియాకు వర్ధన్నపేట మండలమే కేంద్రం. ఇక్కడి నుంచి వాగు లో ఉన్న ఇసుకతోపాటు వాగు వెంట ఉన్న భూముల్లోకి చొచ్చుకుని వెళ్లి భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతోపాటు ఆకేరు గట్టు వెంబడి ఉన్న తోటలు సైతం ధ్వంసమవుతున్నాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్ర మ రవాణాను పూర్తి స్థాయిలో నివారించలేకపోయూరు. ఇసుక మాఫియూ దందాకు ఆకేరు వాగుకు ఇరువైపులా ఉన్న  ఇల్లంద శివారు 551-ఏలో 6.5  ఎకరాలు,  కొత్తపెల్లి శివారు సర్వే నంబర్ 275లో 10 ఎకరాలు, ల్యాబర్తి శివారులోని 166 సర్వే నంబర్‌లో 10 ఎకరాలు, 170 సర్వే నంబర్‌లో 22 ఎకరాల ప్రభుత్వ అసైన్ట్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో ఇసుక మాఫియాపై నలువైపులా విమర్శలు వెల్లువెత్తాయి.
 
 వాత పెట్టారు...
 ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విషయం మండలంలో చర్చనీయాంశంగా మారి... ఆయా శాఖల అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పందించి న అధికారులు పది రోజుల క్రితం ఆకేరు వాగులో దాడుల నిర్వహించి భారీ సంఖ్యలో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమో దు చేశారు. అధికారులు వస్తున్నారనే సమాచారం ముందస్తుగానే తెలుసుకున్న కొంత మంది  యజమానులు ట్రాక్టర్లను తీసుకుని పారిపోయారు. రెండు రోజులపాటు ఇసుక అక్రమ రవాణా పూర్తిగా నిలిచిపోయింది.  ఇసుక రవాణాను అడ్డుకున్నట్లు ఇరు శాఖల అధికారులు ప్రకటనలు ఇచ్చారు. కానీ... ఆ తర్వాత విచారణ పేరిట కాలయాపన చేశారు.
 
 అదే బాటలో రెవెన్యూ శాఖ
 పోలీస్ శాఖ బాటలోనే రెవెన్యూ అధికారులు నడిచారు.  ఇల్లంద శివారు 551-ఏ సర్వే నంబర్‌లోని 6.5 ఎకరాల అసైన్డ్ భూమిని అదే గ్రామానికి చెందిన మల్లెపాక యాకయ్య, పీరయ, బొందయ్య,  కన్నెబోయిన అయిలయ్య, జోగుల సాయిలు, దొమ్మటి మల్లయ్యకు 1977లో లావని పట్టాలు ఇచ్చారు. నిరుపేద రైతులకు అందించిన అసైన్డ్ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు భూ బదలాయింపు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇసుక వ్యాపారుల చేతుల్లోకి వెళ్లేలా మార్గం సుగమం చేశారు. అసైన్డ్ భూమిని అమ్ముకున్న  రైతులకు నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోయారు. కొందరికి ఆ నోటీసులు కూడా ఇవ్వలేదు.
 
 ముడుపులు అందించారు...
 తమ ఆర్థిక మూలాలకు గండిపడుతోందని భావించిన అక్రమార్కులు ఇసుక మాఫియాలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తితో సమాలోచనలు జరిపారు. ఓ దళారీ ద్వారా రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులతో చర్చలు ప్రారంభించారు. ఇరువర్గాలతో చర్చలు జరిపిన దళారులు దాడు లు చేయకుండా ఉండేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులకు చెరో రూ.లక్ష చెల్లించే విధంగా  బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  దీంతోపాటు ప్రతి ట్రిప్పు ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున పోలీసు శాఖకు చెల్లించే ప్రతిపాదనలు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులకు ఇప్పటికే ముడుపులు ముట్టినట్లు ప్రచారం సాగుతోం ది. ‘అందరికీ ముడుపులు అందాయి.. గొడవ సద్దుమణిగింది.’ అని ఓ రెవెన్యూ అధికారి వ్యాఖ్యానించడం కొసమెరుపు.

>
మరిన్ని వార్తలు