బంపర్ ఆఫర్లు

12 Jan, 2015 00:27 IST|Sakshi
బంపర్ ఆఫర్లు

విజయనగరం మున్సిపాలిటీ:  తెలుగు ప్రజల పెద్దపండగ సంక్రాంతి.  దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉద్యోగస్తులు, విద్యార్థులు ఉన్నా పండగ సమయానికి సొంత ఊళ్లకు రావడం ఆనవాయితీ. పెద్దపండగ వస్తోందంటే సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి రావడంతోనే ఏడాదంతా దాచుకున్న డబ్బుతో నూతన వస్త్రాలు, పాదరక్షలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఏటా మార్కెట్‌లో డిస్కౌంట్ ఆఫర్లు హడావుడి సృష్టించేవి. అయితే ఈ ఏడాది డిస్కౌంట్ ఆఫర్లకు బదులుగా బంపర్ ఆపర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇంతవరకు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్‌పై వినియోగదారునికి మోజు తీరిపోయిందని  గ్ర హించారో ఏమో గానీ..దుకాణదారులు  మరికాస్త  ముందుకెళ్లి ఒకటి  కొనండి..రెండవది ఉచితంగా పొందండి అంటూ వినియోగదారులను  ఆకర్షించే పనిలో పడ్డారు. ప్రధానంగా ఏడాది వ్యవధిలో పెళ్లి చేసుకున్న నూతన వధూవరులకు ఈ పండగ వరాలు కురిపిస్తుంది.
 
 కొత్త అల్లుళ్లకు, ఇంటి ఆడపిల్లలకు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేసి కానుకగా అందించడం అనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ఇంట్లో సందడి చేసే మనుమలు, మనుమరాళ్లకు ఈ పండగలో వారు ఏం కోరితే అది కొనిచ్చి సంతోష పెడుతుంటారు. వీరిని దృష్టిలోపెట్టుకుని వ్యాపారులు ఉచితబహుమతులు, సున్నాశాతం వడ్డీతో సులభవాయిదాల పద్ధతులు  ప్రవేశపెట్టి వినియోగదారులను   ఆకర్షిస్తున్నారు.  దీంతో షాపులన్నీ కొనుగోలుదారులతో సందడిగా మారాయి.  జిల్లాకేంద్రమైన విజయనగరం పట్టణంలో మెయిన్‌రోడ్,కన్యకాపరమేశ్వరి  అమ్మవారిఆలయం జంక్షన్,  ఉల్లివీధి, కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో మార్కెట్ రద్దీ నెలకొంది.
 
 కొంగొత్త డిజైన్లు
 అన్ని వర్గాల ప్రజలకు   అందుబాటు ధరల్లో ఉండే పలు రకాల వస్త్రాలు  మార్కెట్‌లో  లభ్యమవుతున్నాయి.  ముఖ్యంగా మధ్య, దిగువ  తరగతి ప్రజలకు  అనువైన ధరల్లో వారి అభిరుచికి తగినట్టు దుస్తులు కొనుగోలుచేస్తున్నారు.   ప్రస్తుతం  ఎక్కువగా  రెడీమేడ్  దుస్తుల పైనే మొగ్గుచూపుతున్నారు. టీషర్ట్స్,జీన్స్, చుడీదార్, శారీస్ వివిధరకాల ఫ్యాషన్ వస్త్రాలు ఎక్కువగా అమ్ముడవుతు న్నాయి. యువకులను ఆకర్షించేందుకు దేశ ప్రధాని నరేంద్రమోడీ వాడే వస్త్రాల తరహాలో కోటు మోడల్స్ నూతన ఆకర్షణగా ఈ ఏడాది మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం  మార్కెట్‌లో రెడీమేడ్ వస్త్రాలు విక్రయించే దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.
 
 ఆధ్యాత్మిక గ్రంథాల పంపిణీ
 విజయనగరం టౌన్ : మతరహిత ఆధ్యాత్మిక గ్రంథాలను మిషన్ తారా విశాల్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు సంస్థ కో ఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఉచితంగా ఆధ్యాత్మిక గ్రంథాలను భక్తులకు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా మానసికంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇ టువంటి పుస్తకాలను చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇప్పటివరకూ పది వేలకు పైగా పుస్తకాలను ఉచి తంగా పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్ట ర్ రంగారావు, ప్రసన్నలక్ష్మి, నిర్మల, వరుణ్, సన, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు