కడప చేరుకున్న ‍స్వాత్మానందేంద్ర స్వామీజీ

14 Dec, 2019 19:29 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామీజీ శనివారం కడప జిల్లాకు చేరుకున్నారు. కడప అమ్మవారిశాలలో కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించుకున్న అనంతరం శ్రీశ్రీ స్వత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ... హిందూ ధర్మ ప్రచారయాత్రా పేరుతో చేపట్టిన దేశవ్యాప్త యాత్రలో ఇప్పటికే 200 పైచిలుకు ఆలయాలను సందర్శించానని తెలిపారు.

మొదటి విడత యాత్రలో భాగంగా చేపట్టిన 11 వేల కిలోమీటర్లు యాత్ర జనవరి 9న కృష్ణా జిల్లాలో పూర్తవుతుందని తెలిపారు. దక్షిణ భారత్‌ తరువాత ఉత్తర భారత్‌ యాత్ర చేపడతానని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. యాత్రలో భాగంగా తనకు భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. స్వాత్మానందేంద్ర స్వామీజీ మొదటి విడత యాత్రలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, పల్లెలను సందర్శించనున్నారు.

మరిన్ని వార్తలు