విద్యుత్ బకాయిల చెల్లింపుపై మాట నిలబెట్టుకోవాలి

25 Apr, 2015 04:56 IST|Sakshi

చంద్రబాబుకు సర్పంచుల సంఘం డిమాండ్

ఒంగోలు : పంచాయతీలకు విద్యుత్ బకాయిల చెల్లింపుపై సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభ్రదాచారి శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 1998లో సీఎంగా చంద్రబాబు నాయుడు మైనర్ పంచాయతీలకు వీధిలైట్ల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. 2002లో  కూడా మైనర్ పంచాయతీలకు ప్రభుత్వమే చెల్లిస్తుందని, కనెక్షన్లను తొలగించవద్దని ఆదేశించారు. తదుపరి ముఖ్యమంత్రులుగా చేసిన కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి కూడా కొనసాగించారని గుర్తు చేశారు.

గత బకాయిల పేరుతో లక్షలాది రూపాయల చెల్లించాలని విద్యుత్ శాఖ ఇస్తున్న బిల్లులపై విచారణ జరిపిపంచాలని డిమాండ్ చేశారు. పంచాయతీ తీర్మానాలపై కలెక్టర్లకు అప్పగించడంపై పంచాయతీ పాలకవర్గాలను అవమానించడమేనన్నారు. దీనిపై పునరాలోచించాలన్నారు. గతంలో తన హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను తిరిగి ప్రారంభించాలన్నారు.

మరిన్ని వార్తలు