సామాజిక సేవే సత్యసాయి ట్రస్టు లక్ష్యం

21 Nov, 2014 03:25 IST|Sakshi

తాడిపత్రి టౌన్ : సేవా ధృక్పథమే శ్రీ సత్యసాయి బాబా లక్ష్యమని, వాటికి అనుగుణంగా శ్రీసత్యసాయి సేవా సంస్థలు,  సత్యసాయి ట్రస్ట్ పని చేస్తున్నాయని సత్యసాయి సేవా సమితి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్ పేర్కొన్నారు. స్థానిక వాటర్ వర్స్స్ రోడ్డులో సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  శ్రీ సత్యసాయి లక్ష్మీనారాయణ స్వామి వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని గురువారం సత్యసాయి సేవా సమితి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ ప్రారంభించారు.

అనంతరం స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రత్నాకర్ మాట్లాడుతూ సత్యసాయి స్పూర్తిగా తీసుకుని  పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా గత 18 సంవత్సరాలు 1500 గ్రామాల్లో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ప్రజలకు నీటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సత్యసాయి  సేవా ట్రస్టు  ద్వారా  నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత వృత్తి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. క్రమశిక్షణతో శిక్షణ పొందాలని నిరుద్యోగ యువకులకు ఆయన పిలుపు నిచ్చారు.

సత్యసాయి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు హెచ్‌జె దొర మాట్లాడుతూ  ఉపాధి శిక్షణతోపాటు, ఆధ్యాత్మిక చింతన విద్యార్థులు అలవరచుకోవాలన్నారు. శ్రీ సత్యనాయి సాధన ట్రస్ట్ సభ్యుడు లక్ష్మినారాయణ, సత్యసాయి సేవా సంస్థల ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రమణి,  రాష్ట్ర అధ్యక్షుడు చలం, అనంతపురం సేవా సంస్థల అధ్యక్షుడు రామాంజప్ప,స్టేట్ కో ఆర్డినేటర్ కృష్ట కుమార్, తాడిపత్రి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృత్తి విద్యా శిక్షణ కోర్సు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దుస్తులు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు