సత్యసాయి పేరిట పోస్టల్ కవరు విడుదల

1 Mar, 2014 01:14 IST|Sakshi
సత్యసాయి పేరిట పోస్టల్ కవరు విడుదల

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: సత్యసాయిబాబాపై భారత తపాలా శాఖ రూపొందించిన కవరును కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భగవాన్ సత్యసాయిబాబా సేవాతత్పరుడన్నారు. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని కొనియాడారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎంతో చొరవ చూపారని, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడన్నారు. దైవగుణాలతో అందరికీ చేరువై చక్కని మార్గాన్ని నిర్దేశిం చిన మహనీయుడని చెప్పారు. సత్యసాయి సేవామార్గాన్ని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదం కావాలనే ఉద్దేశంతో తపాలాశాఖ ప్రత్యేకంగా కవరును రూపొందించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టెలికాం సలహామండలి సభ్యుడు వీవీఎస్ ప్రకాష్, ఏపీ సర్కిల్ ప్రధాన పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్, విశాఖపట్నం పోస్టుమాస్టర్ ఎం.సంపత్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు