అన్నిపార్టీలో నేర చరిత్ర, టీడీపీలో 33%, ఎంఐఎంలో 100%: అమీర్

31 Mar, 2014 15:26 IST|Sakshi
అన్నిపార్టీలో నేర చరిత్ర, టీడీపీలో 33%, ఎంఐఎంలో 100%: అమీర్
ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేసే నేతలే నేర పూరిత రాజకీయాలతో పలు కేసుల్లో చిక్కుపోయారనే వాస్తవాన్ని 'సత్యమేవ జయతే' టెలివిజన్ ధారవాహిక ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఓటర్లలో అవగాహన కల్పించడానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రయత్నం చేశారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ముందండంతో దేశ ప్రజలందరూ ప్రస్తుతం కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. సత్యమేవ జయతే టెలివిజన్ షో ద్వారా పలు విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. 
 
పార్లమెంట్ కు ఎన్నికయ్యే నేతల్లో నిస్వార్ధపరులు, అవినీతికి దూరంగా ఉండాలని పౌరులు కోరుకోవడంలో తప్పేమీ లేదు. గత కొద్దికాలంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ నేరపూరిత రాజకీయాలపై అధ్యయనం చేస్తోంది. ఏడీఆర్ వ్యవస్థాకుడు, ఐఐఎమ్ ఫ్రొఫెసర్  జయదీప్ చోకర్ వెల్లడించిన వివరాల ప్రకారం 543 పార్లమెంట్ సభ్యుల్లో 30 శాతం మంది అంటే 162 మంది ఎంపీలు కేసులు నమోదయ్యాయని చోకర్ తెలిపారు. 
 
2004 సంవత్సరంలో నేరపూరిత ఎంపీలు 129 మంది ఉండగా, 2009 సంవత్సరానికి వచ్చే సరికి 162 మంది ఉన్నారు. ఇక 2014 సంవత్సరంలో ఎంతమంది ఉంటారో చెప్పలేమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చోకర్ వెల్లడించిన లెక్కల ప్రకారం పార్లమెంట్ కు ఎంపికైన నేరపూరిత ఎంపీలు శివసేన లో 82 శాతం, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో 44 శాతం, ఏఐఏడీఎంకే 44, జనతాదళ్ (యూ) 40, బీఎస్పీ 29, ఎస్పీలో 39, జనతాదళ్(ఎస్) 67, ఏఎంఎం 100 శాతం, తెలుగుదేశం పార్టీలో 33 శాతం, ఎంఐఎంలో 100 శాతం మంది ఉన్నారు. వీరిపై హత్యకేసులు, హత్యాయత్నం కేసులు, అక్రమ మానవ రవాణా, కిడ్నాప్, దోపిడి కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఇలాంటి వారి చేతుల్లో మన చట్టాలు తయారవుతున్నాయని ఆమీర్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీలో నిర్భయ కేసు తర్వాత పార్లమెంట్ సభ్యులపై డేటా సేకరించామని అందులో 6 గురు ఎంపీలపై అత్యాచారం కేసులు నమోదుకాగా, 34 మంది మహిళలపై పలురకాల దౌర్జన్యాలను చేసినట్టుగా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో అత్యాచార కేసులు నమోదైన 27 మందికి రాజకీయ పార్టీలు టికెట్లను కేటాయించారని చోకర్ తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి రాజకీయపార్టీలో తక్కువలో తక్కువ 10 శాతం నుంచి 25 శాతం మంది ఎంపీలు నేరాలతో సంబంధమున్నవారని తెలిపారు. 
 
ఉన్నత విద్య కోసం భోపాల్ వెళ్లిన బిటియా అనే విద్యార్థినిని సమాజ్ వాదీ పార్టీకి చెందిన భయ్యా రాజా అనే ఎమ్మెల్యే హత్య చేసిన ఉదంతాన్ని, బిటియా తల్లి తండ్రులు మృగేంద్ర,భారతీల ఆవేదన, న్యాయం కోసం వారును సత్యమేవ జయతే ద్వారా ప్రజలకు చేరవేశారు. హత్యకు కారణమైన భయ్యా రాజాకు సమాజ్ వాదీ, ఆయన భార్యకు ఓ జాతీయ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మాఫియా, నేరపూరిత రాజకీయ నేతలకు పోలీసులే రక్షణ కల్పించడంపై నిరసన వ్యక్తం చేశారు. భయ్యా రాజాపై 82 కేసులున్నాయని, ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి ఎవరూ కూడా ధైర్య చేయలేదని.. తొలిసారి మేమే ఈ కేసులో ఎదురొడ్డి నిలిచామన్నారు. భయ్యా రాజా లాంటి నేరపూరిత రాజకీయ నేతలు పార్లమెంట్ లో చేరి..చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని.. ఇలాంటి నేతలను పార్లమెంట్ లోకి ప్రవేశించకుండా ఓటర్లు తగిన చర్యలు తీసుకోవాలని సత్యమేవ జయతే సూచించింది. 
Courtesy: Satyamev Jayate
మరిన్ని వార్తలు