ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : వామ పక్షాలు

27 Jul, 2018 13:31 IST|Sakshi
కోట వద్ద నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వామపక్ష నేతలు   

విజయనగరం పూల్‌బాగ్‌ :  పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రజాస్వామ్య ఖూనీని నిరసిస్తూ  అఖిలభారత వామపక్షాల పిలుపు మేరకు సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోట జంక్షన్‌ నుంచి కన్యకాపపరమేశ్వరి కోవెల వరకు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీపీఐ నాయకులు బుగత సూరిబాబు మాట్లాడుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో, బీజేపీ త్రిపురలో అధికారం చేపట్టిన నుంచి యథేచ్ఛగా మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆరోపించారు.  

వామపక్ష కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వామపక్ష కార్యకర్తలపైనే కాకుండా ప్రజలపైన తృణమూల్‌ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు.  కార్యక్రమంలో వామపక్ష నేతలు డి.అప్పలరాజు, గాడి అప్పారావు, సుధారాణి, అప్పారావు, రామారావు, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు