ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి

31 Aug, 2018 12:35 IST|Sakshi
వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ మైనారిటీ, యువజన, విద్యార్థి విభాగం నాయకులు 

వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో  వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు

విజయనగరం మున్సిపాలిటీ :  గుంటూరు జిల్లా కేంద్రంలో మంగళవారం జరకిగిన సభలో పౌరులకు కల్పించిన హక్కును కాలరాస్తూ ప్రశ్నించే గళాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తూ ముస్లిం యువకులపై అక్రమంగా కేసులు బనాయించడం, అరెస్టులు చేయటం దుర్మార్గపు చర్యగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్‌ గౌస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి మన్వుర్‌లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి యువకులకు రక్షణ కల్పించాలంటూ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని  అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకుందని, సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అరెస్టులు చేయడం అధికార ప్రభుత్వ రాక్షస తత్వానికి నిదర్శనమన్నారు. శాంతియుతంగా ప్ల కార్డులతో నిరసన తెలిపిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఎనిమిది మంది ముస్లిం యువకులతో పాటు పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

కేసులు ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పరిక్షించాలని  డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్‌.బంగారునాయుడు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్‌ రాజు, మైనార్టీ సెల్‌ నాయకులు ఎండి.రహీమ్, షరీఫ్, సీరజ్, ఇమ్రాన్, షబీర్, రహమాన్‌తో పాటు యువజన, విద్యార్థి విభాగం నాయకులు పొట్నూరు కేశవ, కరకవలస అనిల్, చిన్ని రవి, పైడి, బైక్‌ రమేష్, తరుణ్, గుణ, సప్పా ప్రసాద్, సురేష్‌రెడ్డి, సంతోష్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు