‘అప్పుడే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారు’

19 Sep, 2019 13:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అంటరానితనం పోయినప్పుడే ఎస్పీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని జాతీయ ఎస్సీ కమీషన్‌ మెంబర్‌ రాములు అన్నారు. గురువారం ఆయన కస్తూరిబాయిపేటలోని సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ఈ హాస్టల్లో త్రాగు నీటి సమస్య, దోమల బెడద ఉందని వెంటనే పరిష్కరించాలని కోరారు. కిచెన్‌ సరిగాలేదని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని మండిపడ్డారు. హాస్టల్లో వసతులు మంచిగా ఉంటేనే విద్యార్థులు చదవుల్లో రాణిస్తారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు విద్య ముఖ్యమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవాలని సూచించారు.

కార్పొరేట్‌ విద్యార్థులతో ప్రభుత్వ స్కూల్లో చదివే  విద్యార్థులు పోటీపడి చదవాలన్నారు. ఒక్కో విద్యార్థి కి ప్రభుత్వం తరపున సంవత్సరానికి రూ. 2లక్ష ల50 వేలు ఖర్చు చేస్తుందని, దానికి తగ్గట్టుగా ఫలితాలు ఉండాలని సూచించారు. కులాల పేరుతో దూషించడం సబబు కాదన్నారు. గుంటూరులో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలకే రక్షణ కరవైతే, సామాన్యుల  పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు గుంటూరులో పర్యటించి శ్రీదేశి విషమై వివరణ కోరుతామని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా