సమస్యలివీ...పరిష్కరించండి

27 Mar, 2016 04:42 IST|Sakshi
సమస్యలివీ...పరిష్కరించండి

ఎస్సీ,ఎస్టీ ప్రజావాణిలో అర్జీదారులు
 
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలోని ఎస్సీ,ఎస్టీలు శని వారం ప్రత్యేక ప్రజావాణిలో వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ -2 వెంకటసుబ్బారెడ్డి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.

ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్‌పోస్టులు
 జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆలిండియా ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక నాయకులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్సీ,ఎస్టీల బ్యాక్‌లాగ్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.  జేసీ-2కు వినతి చేసిన వారిలో ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.మునస్వామి తదితరులు ఉన్నారు.

స్కాలర్‌షిప్పుల పెండింగ్
జిల్లాలో 4 నుంచి 8వతరగతి వరకు చదువుతున్న యానాది(ఎస్టీలు) విద్యా ర్థులకు ఉపకార వేతనాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటయ్య కోరారు.

 ఇంటిపట్టాలిప్పించండి
ఇంటి పట్టాలు ఇప్పించాలని చంద్రగిరి మండలం ముంగిలిపట్టు దళితవాడకు చెందిన కే.నారాయణస్వామి, చిరంజీవమ్మ వినతి చేశారు. ఇటీవల తహశీల్దార్ తమపై దుర్భాషలాడుతూ ఇంటిపట్టాలు అడిగితే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారని, ఒక రోజు రాత్రిపూట చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో పెట్టించారని తెలిపారు. నిష్కారణంగా తహశీల్దార్ తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకుని ఇళ్లపట్టాలిప్పించాలని వినతి చేశారు.

>
మరిన్ని వార్తలు