నిధులు స్వాహా!

14 Dec, 2013 06:24 IST|Sakshi

 బెజ్జూర్, న్యూస్‌లైన్ : విద్యార్థులకు బోధన చేయాల్సిన గురువులే అక్రమాలకు పాల్పడుతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. 2011-12 సంవత్సరానికి బెజ్జూర్ మండలంలోని పర్దాన్‌గూడ, తొర్రం గూడ, అందుగూలగూడ, బారెగూడ గిరిజన గ్రామాలకు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.4 లక్షల చొప్పున రూ.16 లక్షలు ఆయా ప్రధానోపాధ్యాయుల ఖాతాలో ఆర్వీఎం అధికారులు జమ చేశారు.

ఈ నిధులతో కాంట్రాక్టర్ సహకారంతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలి. కానీ, అందుగూలగూడ పాఠశాలలో కేవలం డోర్‌లెవల్ వరకు నిర్మాణం చేపట్టగా, మిగతా పాఠశాలల్లో అసలు నిర్మాణాలు చేపట్టలేదు. హెచ్‌ఎంలు మాత్రం రూ.13 లక్షలు డ్రా చేశారు. తొర్రంగూడ పాఠశాల ఖాతా నంబర్ 62080933418 నుంచి అక్టోబర్ 23, 2012న రూ.లక్ష, నవంబర్ 6, 2012న రూ.60 వేలు, నవంబర్ 12, 2012న రూ.32 వేలు డ్రా చేసినట్లు ఉంది. పర్దాన్‌గూడ పాఠశాలలో నిర్మాణాలు లేకుండానే రూ.2,387,50 నిధులు డ్రా చేశా రు. ఈ పాఠశాలలో కేవలం 17 మంది విద్యార్థులకు మండల పరిషత్, గిరిజన పాఠశాలు రెండు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం. మళ్లీ అదనపు గది నిర్మాణానికి నిధులు మంజూరు కావ డం అనుమానాలకు తావిస్తుంది. అందుగూలగూడలో రూ.2.50 లక్షలు, బారెగూడలో రూ.3 లక్షలు డ్రా చేసినట్లు సమాచారం.
 
 నిధులు డ్రా చేసి సంవత్సరం గడుస్తున్నా అధికారుల చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. కాగా, నిధులు జమ అయిన సందర్భంలో ఎస్‌ఎంసీ కమిటీలు లేకపోవడతో డబ్బులు సదరు పాఠశాల ఖాతాలో జమ చేశారు. రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జయింట్ అకౌంట్ ఇవ్వడంతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్దాన్‌గూడ పాఠశాల హెచ్‌ఎం మూడు పాఠశాలకు జాయింట్ ఖాతా ఉండటంతో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం ఉద్దవ్‌ను వివరణ కోరగా నిధులు డ్రా చేసిన ప్రధానోపాధ్యాయుల వేతనాలు నిలిపివేయాలని ఎంఈవో లేఖ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదికలు అంద జేస్తానని తెలిపారు. సంబంధిత ఆర్వీఎం డీఈ మహేందర్‌ను వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి వచ్చిందని విచారణ చేపడుతామన్నారు.
 
 రూ.60 వేలు, నవంబర్ 12, 2012న రూ.32 వేలు డ్రా చేసినట్లు ఉంది. పర్దాన్‌గూడ పాఠశాలలో నిర్మాణాలు లేకుండానే రూ.2,387,50 నిధులు డ్రా చేశా రు. ఈ పాఠశాలలో కేవలం 17 మంది విద్యార్థులకు మండల పరిషత్, గిరిజన పాఠశాలు రెండు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం. మళ్లీ అదనపు గది నిర్మాణానికి నిధులు మంజూరు కావ డం అనుమానాలకు తావిస్తుంది. అందుగూలగూడలో రూ.2.50 లక్షలు, బారెగూడలో రూ.3 లక్షలు డ్రా చేసినట్లు సమాచారం. నిధులు డ్రా చేసి సంవత్సరం గడుస్తున్నా అధికారుల చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. కాగా, నిధులు జమ అయిన సందర్భంలో ఎస్‌ఎంసీ కమిటీలు లేకపోవడతో డబ్బులు సదరు పాఠశాల ఖాతాలో జమ చేశారు. రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జయింట్ అకౌంట్ ఇవ్వడంతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్దాన్‌గూడ పాఠశాల హెచ్‌ఎం మూడు పాఠశాలకు జాయింట్ ఖాతా ఉండటంతో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం ఉద్దవ్‌ను వివరణ కోరగా నిధులు డ్రా చేసిన ప్రధానోపాధ్యాయుల వేతనాలు నిలిపివేయాలని ఎంఈవో లేఖ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదికలు అంద జేస్తానని తెలిపారు. సంబంధిత ఆర్వీఎం డీఈ మహేందర్‌ను వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి వచ్చిందని విచారణ చేపడుతామన్నారు.
 

మరిన్ని వార్తలు