బిడ్డలకు పాఠశాలను సమకూర్చన్నా..

17 Aug, 2018 07:58 IST|Sakshi

విశాఖపట్నం :‘ఊరులో పాఠశాల లేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు చిన్న పిల్లలను పంపించాల్సి వస్తోందన్నా. పాఠశాల మంజూరు చేయాలని పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదు. మీరైనా మా ఊరులో పాఠశాల సదుపాయం కల్పించి పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పాటునందించండి అన్నా..’ అంటూ ములగపూడి పంచాయతీ శివారు డొంకాడ చెందిన గిరిజన మహిళలు జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. కొన్నేళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్నామని, పట్టాలు కోసం పాలకులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత ఎన్నికల్లో తాము వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేశామనే వివక్ష చూపుతున్నారని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని జగన్‌ మోహన్‌రెడ్డి మహిళలకు భరోసా ఇవ్వడంతో వారిలో సంతోషం వెల్లివిరిసింది.  

మరిన్ని వార్తలు